Search This Blog

796. Kamadhukh


She is the form for the holy cow Kamadhenu. 'Mom' is the first word kids call out. You all might have seen a mother with 2 or 3 children. It might be your wife, sister or your own mother in childhood. The common thing in all of them is they are always engaged with kids. One will be asking, "Mom where is my pencil". The other want milk and will be crying out of hunger. He can't wait until the milk boils. Meanwhile the elder one will come shouting from the door, "Mom! I forgot my book, get it to me please urgent!". These children are unforgiving. They say, "Why does it take so much time" if there is a slight delay. But mom bears it all. She helps them always. 

Now look at Divine mother. She is the mother of 84 lakh species. So she is always busy. Hence she is called Kamadukh.

కామధేను స్వరూపం గలది. అమ్మ తన పిల్లల కోరికలు తీర్చటంలో కామధేనువు వంటిది. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్న తల్లిని మీరు చూసే ఉంటారు. ఆవిడ మీ ఆమ్మో, చెల్లో లేక భార్యో ఎవరైనా కావచ్చు. వారు పిల్లల కోరికలు తీర్చడంలో నిరంతరం సతమతమవుతూ ఉంటారు. విషయం చిన్నదైనా కావచ్చు లేదా పెద్దదైన కావచ్చు. కానీ పిల్లల నోటిలోంచి వచ్చే మొదటి పదం 'అమ్మా'! ఒకడు అమ్మా నా పెన్సిల్ ఏది అంటాడు. ఇంకోడు అమ్మా నాకు చాలా ఆకలి వేస్తోంది వెంటనే పాలు ఇయ్యి అంటాడు. పాలు మరిగే దాకా కూడా ఆగలేడు వాడు. ఈ లోగా పెద్ద వాడు వచ్చి అమ్మా నాన్నగారి పద్దు పుస్తకం కావలి వెంటనే ఇవ్వు అంటాడు. కాస్త ఆలస్యం అయితే వీరంతా విసిగిపోయి ఇంకా రాలేదా, ఇంకా అవ్వలేదా, ఎందుకింత సేపు అంటూ ఆమెపై విరుచుకు పడిపోతారు.  కానీ ఆవిడ ఓపిగ్గా తన పని తానూ చేసుకుంటూ అందరికీ అన్నీ సమకూరుస్తుంది. ఆవిడకి ఎప్పుడూ విసుగు పుట్టదు. ఏనాడూ కోపం రాదు. అదే అమ్మ అంటే. 

లలితమ్మ కూడా అంతే. 84 లక్షల జీవ రాశులను ఆవిడ పోషించాలి. ఎందుకంటే వారందరికీ ఆవిడే అమ్మ. అందుకే కామదుఖ్ అన్నారు. 

No comments:

Post a Comment

Popular