విరాడ్రూపము గలది. విశ్వరూపము గలది. విశ్వంలోని జీవులన్నింటికీ ప్రతీకయైన వైశ్వానరుని రూపం గలది. ఈ విషయమంతా 'విశ్వరూపా' అనే 256వ నామంలో వివరించాం. అందుకని మళ్ళీ చెప్పటం లేదు. విరాడ్రూపాన్ని వర్ణిస్తూ పిల్లలు దసరాపండుగలో పాటలు పద్యాలు పాడతారు.
ధరసింహాసనమై నభంబుగొడుగై
తద్దేవతల్ భృత్యులై పరమామ్యాయము
లెల్లవందిగణమై బ్రహ్మాండమాకారమై
శ్రీ భార్యామణియై విరించి కొడుకై
శ్రీగంగ సత్పుత్రియై, వరస న్నీఘనరాజ
సొమ్ముసనిజమై వర్ధిల్లు నారాయణా !
జయీభవ ! విజయీ భవ ! దిగ్విజయీ భవ.
భూమి సింహాసనమై ఆకాశం గొడుగై ముక్కోటి దేవతలు సేవకులై యక్ష గంధర్వాదులు వందీ మాగదులై ఈ బ్రహ్మాండమే ఆకారమై లక్ష్మీ దేవి భార్యయై, బ్రహ్మ కొడుకై, గంగ కూతురై వర్ధిల్లు నారాయణా జయీభవ ! విజయీ భవ ! దిగ్విజయీ భవ అంటూ విరాడ్రూపాన్ని స్తోత్రం చేస్తారు. అమ్మ అటువంటి విరాడ్రూపం గలది.
శ్రీమద్భాగవతంలోని వామనావతారంలో వామనుడు విశ్వరూపం ధరిస్తాడు.
ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధృవునిపై నంతై మహర్వాటి పై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై ||
ఆ క్షణంలో ఆకాశంలో ఉన్న సూర్యబింబము
రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్వసమై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ న్నిండుచోన్ II
అని చెబుతారు. కాబట్టే పరమేశ్వరి విరాడ్రూపా అనబడుతోంది.
No comments:
Post a Comment