Search This Blog

లే... బయలుదేరు...

కుదిరితే పరిగెత్తు.. ,

 

లేకపోతే నడువు...

 

అదీ చేతకాకపోతే...

 

పాకుతూ పో.... ,

 

అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

 

ఉద్యోగం రాలేదని,

 

వ్యాపారం దెబ్బతినిందని,

 

 'స్నేహితుడొకడు మోసం చేశాడని,'

 

ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...

 

అలాగే ఉండిపోతే ఎలా?

 

 దేహానికి తప్పదాహానికి పనికిరాని

 

ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

 

తలుచుకుంటే...

 

నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...

 

నీ ముందు తలదించుకునేలా  చేయగల సత్తా నీది,

 

 అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

 

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,

 

పారే నది..,

 

వీచే గాలి...,

 

ఊగే చెట్టు...,

 

ఉదయించే సూర్యుడు....

 

అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,

 

ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

 

లే...

 

బయలుదేరు...

 

నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,

 

పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

 

నువ్వు పడుకునే పరుపు...

 

నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

 

నీ అద్దం....

 

నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

 

నీ నీడ నిన్నువదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

 

మళ్ళీ చెప్తున్నా...

 

కన్నీళ్ళు కారిస్తే కాదు...,

 

చెమట చుక్కని చిందిస్తేనేచరిత్రను రాయగలవని తెలుసుకో..

 

*చదివితే ఇవి పదాలు మాత్రమే* ,

 

 *ఆచరిస్తే  అస్త్రాలు* .

 

-Sri Sri


No comments:

Post a Comment

Popular