కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
అంతేకానీ
ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
'స్నేహితుడొకడు మోసం చేశాడని,'
ప్రేమించినవాళ్ళు
వదిలి వెళ్ళి పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప, దాహానికి
పనికిరాని
ఆ
సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే...
నీ
తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ
ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో
చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది
సాధించాలని నీలో
కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ
ఏది ఆగిపోడానికి వీల్లేదు..,
లే...
బయలుదేరు...
నిన్ను
కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ
చోటు నుండే పరుగు మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను
చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,
నీ అద్దం....
నిన్ను
ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,
నీ
నీడ నిన్నువదిలేయకముందే
వెలుగులోకి వచ్చేయ్..,
మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట
చుక్కని చిందిస్తేనేచరిత్రను
రాయగలవని తెలుసుకో..
*చదివితే ఇవి పదాలు మాత్రమే* ,
*ఆచరిస్తే అస్త్రాలు* .
-Sri Sri