ఇప్పటి వరకు షట్చక్రాలకు అధిష్టాన దేవతలను చెప్పి ఇప్పుడు చక్రాలను వివరిస్తున్నారు. యోగినీన్యాసం ప్రకారము ఇక్కడ నుండి 67 నామాలతో షట్చక్రాలను వివరిస్తున్నారు.ఈ చక్రాలలో యోగినీదేవతలున్నారు. డ ర ల క స హ య అనే ఏడు అక్షరాలచేత వారి పేర్లు ప్రారంభమవుతాయి. 1. డ - దాకిని, 2. ర- రాకిని, 3. ల - లాకిని, 4. క - కాకిని, 5. స- సాకిని, 6. హ - హాకిని, 7. య - యాకిని
షట్చక్రాలలో ప్రతి చక్రానికి కొన్ని దళాలున్నాయి. ఆ దళాలలో కొన్ని అక్షరాలున్నాయి. ప్రతీ చక్రానికి ఒక దేవత ఉన్నది. వాటిని ఈ దిగువ ఇవ్వటం జరిగింది.
************************************************************************
చక్రము దళాలు |అధిపతి | దేవత | అక్షరాలు | తత్త్వము
విశుద్ధి చక్రం 16 దళాలు |మహేశ్వరుడు | డాకిని | ఆ నుంచి అః వరకు | ఆకాశము
అనాహతము 12 దళాలు |రుద్రుడు | రాకిని | క నుంచి ఠ వరకు | వాయువు
మణిపూరము 10 దళాలు |విష్ణువు | లాకిని | డ నుంచి ఫ వరకు | జలము
స్వాధిష్ఠానము 6 దళాలు | బ్రహ్మ | కాకిని | బ నుంచి ల వరకు | అగ్ని
మూలాధారము 4 దళాలు | గణపతి | సాకిని | వ నుంచి స వరకు | భూమి
ఆజ్ఞ 2 దళాలు |సదాశివుడు | హాకీని | హ, క్ష | మనస్సు
సహస్రారం 1000 దళాలు | పరమేశ్వరుడు|యాకిని| అన్ని అక్షరాలు | ఆత్మ
************************************************************************
షట్చక్రాలను గురించి చెప్పేటప్పుడు ముందు ఆధారచక్రం చెప్పకుండా విశుద్ధి చక్రం నుంచి ప్రారంభిస్తారు. ఇలా పై నుంచి కాకుండా, క్రింద నుంచి కాకుండా మధ్యలో నుంచి ఎందుకు ప్రారంభించాలి అని అనుమానం వస్తుంది. దీనికి కారణము. అ కారాది క్ష కారాంతము వర్ణాలు విశుద్ధి చక్రం నుంచి ప్రారంభమయి ఆజ్ఞాచక్రంతో పూర్తవుతాయి. అందుచేత అదేక్రమంలో షట్చక్రాలను కూడా చెప్పటం జరుగుతోంది.
విశుద్ధి చక్రం.
కంఠస్థానానికి కొంచెం దిగువగా 16 దళాలతో ఉండే పద్మాన్ని విశుద్ధి చక్రం అంటారు. ఇది తెల్లని రంగులో ఉంటుంది. దీని పదహారు దళాలలోను ఆ నుంచి అః వరకు అచ్చులుంటాయి. ఈ పదహారుదళాలందు పదహారుశక్తులు పరివేష్టించి ఉండగా చక్రాధిష్టాన దేవత వజ్రేశ్వరి దీని మధ్యన ఉంటుంది. దీని కర్ణికయందు త్రికోణము, దానియందు చంద్రమండలము దానిలో తెల్లని ఏనుగు, దానిమీద హం అనే ఆకాశబీజము ఉంటాయి. ఇక్కడ మహేశ్వరుడుంటాడు.
Until now, we discussed about the presiding deities of Shatchakras and now we are explaining the chakras. In the next 67 names, we will learn about Shatchakras as described in Yogininyasam.
All chakras have yoginis. Their names begin with the seven letters Da Ra La Ka Sa Ha Ya. 1. Da - Dakini, 2. Ra - Rakini, 3. La - Lakini, 4. Ka - Kakini, 5. Sa - Sakini, 6. Ha - Hakini, 7. Ya - Yakini
Each of the six chakras has certain petals. There are some letters in those petals. Each chakra has a deity. They are given below.
****************************************************** **********************
Chakra petals |Chief | Goddess | Letters | philosophy
Vishuddhi Chakra 16 petals |Maheswara | Dakini | From Aa to Ah | the sky
Anahata 12 petals |Rudra | Rakini | From Ka to THa | the air
Manipur 10 petals |Vishnu | Lakini | From Da to Pha | the water
Swadhisthana 6 petals | Brahma | Kakini | From Ba to La | the fire
Moolaadhaaara 4 petals | Ganapati | Sakini | From Va to Sa | the land
Agna 2 petals |Sadashiva | Hakini | Ha, Ksha | the mind
Sahasraram 1000 petals | Paramesvara|Yakini | All letters | the soul
****************************************************** **********************
When describing the six chakras, we start from Vishuddhi Chakra. One may wonder why we should start from the middle and not from the top and not from the bottom. It is beacuse the letters Aa to Ksha start from Vishuddhi Chakra and ends with Ajna Chakra.
Vishuddhi Chakra:
Vishuddhi chakra is slightly beneath the throat. It is white in color. It has 16 petals. These represents the 16 vowels sounds (Aa to Aha). Vajreshwari, the head of Vishuddhi is at the centre and surrounded by 16 shaktis. At the pericarp, there is a triangle inside which there is chandra mandala. There is a white elehant inside it. 'Ham' the Akaasha beeja is on it. Here you find Maheswara.