Search This Blog

337-340.Vidhaatri..vilaasinee

337.Vidhaatri - Vidhata is the one who gives results according to the actions of all the beings. Vidhata is the one who wears the worlds in the forms of Ananta, Adi Kurma, etc. The acts of creation  and destruction are all subjects of Divine Mother. It is she who sustains all the worlds. Dhatri means the one who wears. Divine mother is called dhatri because she wears the whole universe with ashtadiggajas and kulaparvataas.

Ashtadiggajas - 1.Airavata, 2.Pundarikam, 3.Vamanam, 4.Kumudam, 5.Anjanam, 6.Pushpadanta, 7.Sarvabhouma, 8.Suprathikam. 
Kula parvatas - 1.Mahendragiri, 2.Malayagiri, 3.Sahyagiri, 4.Himavadgiri, 5.Gandhamadhanagiri, 6.Vindhyagiri, 7.Pariyatragiri 

mahendro malayaa ssahya sshuktimaan gandhamaadanaH
vindhya sca pariyatra saptaite kulaparvataaH 

338. Vedajanani - The one who created the Vedas. All the letters come from the energy of kundalini. That's why she's called Mother of Vedas. 

339. Vishnumaaya- Vishnu is the one who cannot be divided by the time or space. Vishnu Sahasranama starts as Vishwam Vishnuh. That is to say, Vishnu is the one that is spread all over the universe and has filled himself in it. But not everything looks the same to our eyes. When everything is filled with the samething, shouldn't everything look the same to us? So why do we see various different things around us? The reason for this is Vishnu Maaya. We are deluded due to this.

340. Vilasini- Vikshemapana shakti means one that can make things fly. The Sushumna nadi has the form of depositive energy that covers the Brahma randhra. This is called Vilasini. It covers the knowledge that the practitioners and yogis seek.

337.విధాత్రీ - అనంతమైన జీవులయొక్క కర్మలను బట్టి ఫలితము నిచ్చేవాడు విధాత. అనంతుడు, ఆది కూర్మము మొదలైన రూపములలో జగత్తులను ధరించువాడు విధాత. అమ్మే సృష్టి స్థితి లయ కారకురాలు. ఆవిడే అన్ని జగములను పోషించునది. ధాత్రి అంటే ధరించునది. అష్టదిగ్గజములు, కులపర్వతములతో ఈ భూమిని ధరిస్తున్నది కాబట్టి ధాత్రి అనబడుతున్నది.

అష్టదిగ్గజములు - 1.ఐరావతము, 2.పుండరీకము, 3.వామనము, 4.కుముదము, 5.అంజనము, 6.పుష్పదంతము, 7.సార్వభౌమము, 8.సుప్రతీకము. 

కులపర్వతములు - 1.మహేంద్రగిరి, 2.మలయగిరి, 3.సహ్యాగిరి, 4.హిమవద్గిరి, 5.గంధమాధానగిరి, 6.వింధ్యగిరి, 7.పరియాత్రగిరి 

మహేంద్రో మలయా స్సహ్య శ్శుక్తిమాన్ గంధమాదనః |
వింధ్య శ్చ పారియాత్ర సప్తైతే కులపర్వతాః ||

338. వెదజననీ - వేదములను పుట్టించినది లేక సృష్టించినది. కుండలినీ శక్తినుంచే అక్షారాలన్నీ వచ్చాయి. అందుకే ఆమె వెదజననీ

339. విష్ణుమాయా - దేశకాలమానములచే విభజించటానికి వీలుకాని వాడు విష్ణువు. విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుహ్ అంటూ మొదలవుతుంది. అంటే అంతటా వ్యాపించి నిండి నిభిడీకృతమైనది విష్ణువు. కానీ మన కంటికి అంతా ఒకేలా కనిపించదు. అంతటా ఉన్నది ఒకటే అయినప్పుడు మనకు కూడా అంతా ఒకేలా కనిపించాలికదా? మరి ఎందుకు మనకు ఆలా కాకుండా వివిధ రకములుగా కనిపిస్తుంది? దానికి కారణం విష్ణు మాయ. ఆ మాయ వలెనే మనము భ్రమకు లోనవుతుంటాము.

340. విలాసినీ - విక్షేమపణశక్తి అంటే ఎగరవేయు శక్తి కలది. శుషుమ్నా మార్గంలో బ్రహ్మరంధ్రాన్ని కప్పి ఉంచే నిక్షేపణశక్తి రూపము కలది. దీనినే విలాసినీ అంటారు. ఉపాసకులు, యోగులు తెలుసుకోదగిన మార్గాన్ని కప్పి ఉంచుతుంది. 

Popular