Search This Blog

249-250. Panchaprethasanasina Panchabrahmaswarupini

249.Panchaprethasanasina - Divine mother's throne is supported by lifeless bodies of Brahma, Vishnu, Rudra, Eesa and Sadasiva. This means without Shakthi, there is no stimulus to these great devatas. To understand easily we can draw an analogy of Shiva and Shakti with word and the meaning. Without meaning, the word is pointless, without word, meaning cannot exist. Such is the relation between Shiva and Shakti.

In software engineering, we have OOPS concept. We have classes and objects in it. A class is like Shiva and an object is like Shakti.

249.పంచప్రేతాసనాసీనా - బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అమ్మ సింహాసనానికి కోళ్ళుగా నిర్జీవంగా ఉన్నారు అని ఈ నామానికి అర్ధం. అంటే శక్తి లేకపోతే ఎంతవారైనా చలనంలేక స్థాణువులులా పడివుంటారు అని అర్థం. తేలికగా ఒక  ఉదాహరణతో చెప్పాలి అంటే శివ శక్తుల సంబంధం పదం - భావం మధ్య సంబంధంలాంటిది. భావం లేకపోతే పాదమున్నా దాని ఉనికి మనకి తెలియదు. అలాగే పదం లేనిచో భావనయొక్క ప్రస్తావనే రాదు. అసలు పదాన్ని దాని భావాన్ని విడివిడిగా ఊహించుకోవడమే కుదరదు. అలాగే శివశక్తులు కూడా.

software engineering లో OOPS అని ఒక పధ్ధతి ఉంటుంది. అందులో class - object అని రెండు ఉంటాయి. class శివం అయితే object శక్తి. 

250.Panchabrahmaswarupini - 'Para Brahman' is the truth and knowledge. He is pure and eternal. But still, with his Shakti, he personified as Brahma, Vishnu, Rudra, Eswara, Sadasiva. Divine mother is the shakti behind these five. Hence, she is called Pancha Brahma Swaroopini

250.పంచబ్రహ్మస్వరూపిణీ - సత్యము, జ్ఞానము అయినవాడు, వికార రహితుడు, పరిశుద్ధుడు అయిన వాడు ఆ పరబ్రహ్మ ఒక్కడే. అయినప్పటికీ ఆయన తన శక్తితో 5 స్వరూపాలుగా ఉన్నాడు అని చెప్పబడింది. వారే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీరి స్వరూపమే మన అమ్మ. అందుకే పంచ బ్రహ్మ స్వరూపిణీ అని అన్నారు.

Popular