Search This Blog

241-243. Charurupa...charuchandrakaladhara

241.Charurupa - She who is very beautiful

242.Charuhasa - She who has a beautiful smile. In the names 241 and 242, we have to understand that Divine Mother attracts all her children towards her. Humans, birds, animals etc are all being attracted towards her.

243.Charuchandrakaladhara - The moons glow is said to be of 15 varieties. He exhibits one each day from paadyami to full moon/new moon. Of all these, the glow on ashtami or 8th day is a bit special. It is same in both waxing and waning phases. All these glows came from Divine mothers Nityakala (Eternal glow). This is the 16th. To denote her eternal glow, Divine mother wears a crescent moon on her crown. This moon never changes.

241.చారురూపా - అందమైన రూప లావణ్యము కలది

242.చారుహాసా - మనోహరమైన మందహాసము కలది. 241, 242 నామాలలో మనం గమనించ వలసినదేమిటంటే అమ్మ తన బిడ్డలనందరిని తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది. మనుషులు, పక్షులు, జంతువులూ మొదలైనవన్నీ ఆమెచే ఆకర్షించ బడతాయి.

243.చారుచంద్రకలాధరా - చంద్రునికి 15 కళలు ఉంటాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి/అమావాస్య దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ ప్రదర్శిస్తాడు చంద్రుడు. ఇందులో అష్టమి నాటి కళకు ఒక ప్రత్యేకత ఉంది. అది శుక్ల పక్షంలోను కృష్ణ పక్షంలోను కూడా ఒకేలాగా ఉంటుంది. ఈ చంద్రకళలు చూడటానికి ఏంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇవన్నీ అమ్మనుండే వచ్చ్చాయి. ఆవిడది నిత్యకళ. అది 16వ కళ. దానిని సూచించడానికి అమ్మ తన కిరీటానికి వృద్ధిక్షయాలు లేని నెలవంకను  తగిలించుకుంటుంది.

Popular