Search This Blog

144-147. Nityamuktha...Nirashraya

144.Nithyamuktha - 'Muktha' means liberated. Free! She who is forever free of various bonds of the world. How do you get bound if you are free?

When your actions are initiated by an underlying desire, it is called 'karma'. When the actions follow the principles of dharma, it results in 'Punya'. Otherwise it results in 'papa'(sin). As long as you perform karma, you either accrue 'punya' or 'paapa'. These are the bonds. In order to be liberated, you should neither have 'Punya' nor 'Paapa'. You should be in absolute state of neutrality. Divine mother does not have any underlying desire behind her actions. Hence, she does not have any bounds of 'Papa' or 'Punya'.

One should not think that he/she will be liberated by accruing 'Punya'. It will only lead to a better life in the next birth.

145.Nirvikara - Our body undergoes several changes. It has birth, death, growth, maturity etc. But soul never changes. It is like the electric bulb on a drama stage. It acts as a witness to the whole drama but never gets effected by the drama.

In vedic lingo, this body is called 'annavikaaram'. 'Akaaram' means shape. 'Vikaaram' is transformed shape. 'Annam' means food. What is left after food got transformed due various chemical processes is this body. So technically, it is 'annavikaaram'

146.Nishprapancha - The creation started with 'OM'. From 'OM' came karma. Then the three gunas (sattva, rajas, tamo). Then 5 tanmatras. These tanmatras gave rise to 10 subtle forms. They are the 5 elements and 5 senses. That is why you can see that each pair of element + senses is bound by a tanmatra. For eg: There is a tanmatra linking sky with sense of hearing, Fire with sense of sight, etc. After that more physical forms emerged. The word prapancha represents all of this. Divine mother existed even beyond 'OM'. So, she is 'Nishprapancha'.

147.Nirashraya - Divine mother (Shakti) is the base for the whole creation. So she neither have nor need a base. 

144.నిత్యముక్తా - ముక్తా అంటే విడుదలచేయబడిన అని అర్ధం. అమ్మ ఎల్లప్పుడూ స్వతంత్రురాలు. కోరికతో ఏదైనా పని చేస్తే అది కర్మ అవుతుంది. చేసిన కర్మ ధార్మికమైతే అది పుణ్యాన్నిస్తుంది. లేదంటే పాపం అంటుకుంటుంది. ఈ పాపపుణ్యాలే మన దాస్య శృంఖలాలు. అమ్మ ఏ కర్మలు చేయదు. ఆవిడ చేసే పనులు కేవలం లోకకల్యాణం కొరకే తప్ప వేరే ఏ స్వార్థ ప్రయోజనం కోసం కాదు. అందుకే నిత్యముక్త అన్నారు.
పుణ్యం ఆర్జిస్తే మోక్షం లభించదు. ఆ పుణ్యబలం వల్ల ఇంతకన్నా మంచి జన్మ లభిస్తుంది తప్ప జన్మరాహిత్యం కలుగదు. 

145.నిర్వికారా - మన శరీరానికి ఆరు రకముల మార్పులు ఉంటాయి. అవి 1. జన్మ. 2. స్థితి 3. వృద్ధి 4. విపరిణామము 5. క్షయము 6. నాశనము. కానీ ఆత్మకు ఈ మార్పులు ఏవి ఉండవు. నాటక రంగంలో వెలుగుతున్న విద్యుత్ దీపం వలె ఈ కదలికలకి సాక్షిగా  ఆత్మ మన శరీరంలోనే ఉంటుంది. కానీ ఎటువంటి వికారం చెందదు.
వేదిక పరిభాషలో ఈ శరీరాన్ని అన్నవికారం అంటారు. ఆకారం మార్పు చెందాక మిగిలి ఉన్నది వికారం. శరీరం అన్నం కొన్ని రసాయన చర్యలవల్ల మార్పు చెందాక వచ్చింది కనుక అన్నవికారం. 

146.నిష్ప్రపంచా - ఈ సృష్టికి 'ఓం' ప్రధమం. అందులోంచి కర్మ పుట్టింది. కర్మ నుండి మూడు గుణాలు వచ్చాయి. తరువాత 5 తన్మాత్రలు వచ్చాయి. వాటినుండి పంచభూతాలు, పంచేంద్రియాలు వచ్చాయి. తరువాత మరింత స్థూల రూపాలు వచ్చాయి. ప్రపంచం అంటే ఓం నుండి ఇప్పటివరకు చెప్పినదంతా. కానీ 'ఓం' వచ్చిందే అమ్మనుండి కదా. అందుకే ఆవిడ నిష్ప్రపంచ - వీటన్నింటికీ అతీతం.

147.నిరాశ్రయా - సమస్త జగత్తు అమ్మని ఆధారంగా చేసుకుని ఉన్నది. అలాంటప్పుడు ఆవిడకి వేరే ఆధారం ఏముంటుంది. ఆమె అన్నింటికీ ఆశ్రయం. ఆవిడ నిరాశ్రయ. 

Popular