అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరమధనం చేస్తున్నారు. అందులోంచి కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, హాలాహలం వచ్చాయి. చివరకు అమృతం వచ్చింది. అమృతం కోసం మళ్ళీ దేవదానవులు తగువులాడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి రాక్షసులను భ్రమింపచేసి, అమృతాన్ని దేవతలకు అందించాడు. ఆ సమయంలో కంఠంలో గరళాన్ని ఉంచుకున్న శంభుడు మోహినిని చూసి చాలించాడు. అప్పుడే అయ్యప్ప స్వామి జననం జరిగింది. అమ్మ మాయా మోహినీ స్వరూపం దేవతలను, రాక్షసులను మాత్రమేకాదు, శంభుడిని కూడా మోహింపచేసింది. అందుకే శంభు మోహిని అని అన్నారు.
Those who pacify thanmathras triumph over senses. All sensory pleasures are momentary. They don't crave for such momentary pleasures. That is God Shambhu. He has a still mind. However, even he is not beyond the realm of Mother's maya. He succumbed to her power of illusion. The secret being revealed here is, after triumphing over senses, spiritual practitioners should not relax. They should continue their pursuit and rise to the level beyond maya. Only then they will reach the final state of Liberation.
Both devatas and raakshasas teamed up to stir the milky ocean to pull out amruta out of it. The kamadhenu, kalpavruksham, iraavatam, haalahalam came from it. After that came amruta. Devatas and Rakshasa started bickering for amrutha. Then Lord Vishnu came in the form of Mohini. He mesmerized everyone and served amrutha to devatas. Lord Shambhu who swallowed the haalahala and kept in his throat also got mesmerized with the beauty of Mohini. That eventually led to the birth of Lord Ayyappa. As even Lord Shambhu succumbed to mother's power of illusion, she is called Shambhu Mohini.
ఈ కధలో ఒక గొప్ప సాంకేతిక ప్రక్రియ దాగి ఉంది. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల వేడిని భూమిపై ఉన్న జీవాలు భరించలేవు. భూమి ఉపరితలంలో ఉన్న ఓజోన్ పొర ఆ నీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది. మనకు క్షేమమైనవి అవసరమైనవి అయిన సూర్య కిరణాలనే భూమి మీదకు పంపిస్తుంది. క్షీర సాగర మధనంలో హాలాహలం పుట్టినప్పుడు అదే జరుగుతుంది. ఆ హాలాహలంనుండి భరించలేని వేడి ఉత్పన్నమవుతుంది. అప్పుడు దేవతలు, రాక్షసులు, ఋషులు శంభుడిని కాపాడమని వేడుకుంటారు. నీవే మా అందరికీ తండ్రివి. నీ పిల్లల్ని రక్షించే భారం నీదే అని అంటారు. అప్పుడు ఆయన ఆ హాలాహలాన్ని గుటుక్కుని మింగివేస్తాడు. మింగాడుకాని దానిని కడుపులోకి పంపలేడు. ఎందుకంటే ఆయన కడుపులో అధోలోకాలు ఉన్నాయి. దాని వేడికి అవి నాశనమవుతాయి. అందుకని దానిని ఆయన కంఠంలోనే ఉంచుకుంటాడు. అది అక్కడినుంచి నీల కాంతి వెదజిమ్ముతుంది. అందుకే శివునికి నీలకంఠుడు అని పేరు వచ్చింది.