Search This Blog

944. Vajrini

 

Indra with his Vajrayudha made from the spine of Saint Dadheechi is fighting with Vritrasura 

వజ్రిణీ అంటే వజ్రాయుధం గల ఇంద్రుడి భార్య. అంటే అతని శక్తి. ఈ వజ్రాయుధం ఆకాశంలోని మెరుపు వలె ఉంటుంది. రాక్షస సంహారంలో వజ్రాయుధానికి తిరుగులేదు.  అసలు ఈ వజ్రాయుధం ఎలా తయారయ్యిందో తెలుసుకుందాం. 

వృత్రాసురునితో పోరులో దేవతలు ఓటమిపాలవుతారు. అప్పుడు వారందరూ తమ తమ ఆయుధాలు రాక్షసుల పాలవకుండా చూడమని వాటిని దధీచి మహర్షికి ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఈ ఆయుధ సంరక్షణ భారం దధీచి మహర్షిపై పడుతుంది. ఆ ఆయుధాలను తస్కరిద్దామని రాక్షసులు నిత్యం ఆయన ఆశ్రమం వద్ద వేచిచూస్తూ ఉంటారు. మహర్షి ఎంతో భద్రంగా వాటిని కాపాడుతూ ఉంటారు. క్రమేపి అది ఒక లంపటంగా మారి ఆయన తపోసాధనకు అవరోధం అవుతుంది. అప్పుడు మహర్షి తన తపోశక్తితో ఆ ఆయుధాలను నీటిలో కరిగించి ఆ నీటిని తన నోటితో తాగేస్తాడు. ఆయుధాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్లి జీర్ణం అయిపోతాయి. వాటి శక్తిని మహర్షి ఎముకలు గ్రహిస్తాయి. ఆయుధాలు తస్కరిద్దామని ఎదురు చూస్తున్న రాక్షసులు అది తెలుసుకుని ఇక ఆ ప్రయత్నం మాని వెనక్కు వెళ్ళిపోతారు.  కొంత కాలం తరువాత దేవతలు వారి ఆయుధాల కోసం వస్తారు. తమ తమ ఆయుధాలు తిరిగి ఇమ్మంటారు. అప్పుడు మహర్షి జరిగినది చెప్పి, తన యోగ బలంతో మృత్యువు పొందుతానని ఆ తరువాత తన శరీరంలోని యముకులతో ఆయుధములు తయారు చేసుకోమని చెపుతాడు. తరువాత ఆయన కళ్ళు మూసుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. కాసేపటికి శరీరం పడిపోతుంది. అప్పుడు దేవతలు మహర్షి చెప్పినట్లు గానే ఆయన యముకులతో ఆయుధాలు తయారుచేసుకుంటారు. ఆయన వెన్నుముక్కతో ఇంద్రుడు వజ్రాయుధం తయారుచేస్తాడు. దానితో మళ్ళీ వృత్రాసురునితో యుద్ధం చేసి, విజయం సాధిస్తాడు. 

మనలోని దేవతా శక్తులకు తపో సాధన తోడైతే సన్నని మెరుపు తీగ వంటి కుండలిని జాగృతం అవుతుంది. అప్పుడు అది పైకి ఎగబాకి సహస్రారం చేరుతుంది. ఏ రాక్షస శక్తులు దాన్ని అడ్డుకోలేవు. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియకు నిదర్శనం వజ్రిణీ నామం. 

Vajrini is the shakti of Indra who carries the weapon Vajra. It looks like lightening in the sky. It is the most powerful weapon against Rakshasas. Let us learn about the story of the weapon Vajra.

When Devatas lost the war Vrutrasura, they all fled away to hide and do penance. Before fleeing, they left all their weapons with Saint Dadheechi and requested him to keep them safe. Dadheechi agreed. Having come to know about this, Rakshasas started plans to find out ways to steal them from saint Dadheechi. Saint took utmost care to protect the weapons. He waited for a long time for Devatas to return. But they didn't. Gradually protecting the weapons from Rakshasas became an unwanted responsibility to Dadheechi. To overcome it, he dissolved all the weapons in water and drank it. The power of the weapons is absorbed by his bones. Seeing the way Devatas weapons disappeared, Rakshasas gave up on stealing them and returned to their homes. After sometime, Devatas returned from penance and asked about their weapons. Saint Dadheechi explained what happened and advised that using his supernatural powers, he will invite death and leave his body. Post that they can use his bones to manufacture powerful weapons. Devatas agreed. Saint accepted death and left his body. Then Devatas manufactured various weapons with his bones. Indra created Vajrayudha from the spine of Saint Dadheechi. He fought valiantly with Vrutrasura again and defeated him.

When we add penance to the Devata Shaktis with in us, we will awaken the kundalini. It looks like a thin thread of lightening. It rises up through the spine and reaches sahasrara. Strength of Rakshasas cannot stand before Kundalini. Vajrini is the name that represents this spiritual phenomenon.

Popular