Search This Blog

914. Swastha

Swastha means being in one's natural state. Divine mother is beyond the three gunas. Hence she has no transformation physically or mentally. She is totally independent

It is said like this in Chandogya upanishath
Sage Naarada asks Sanathkumara - "Where does the infinite reside?" Sanath Kumara replies, "It rests on its own natural power"

Once Ganesha was playing with a cat and caused lot of injuries to it. Then he went to his mother Parvati. He saw bruises on her body and asked, "Mother! Who hurt you like this?". Mother Parvati replied, "It is you my child. You beat the cat and that hurt me like this. Because I am everywhere that means I am inside that cat as well."

స్వస్థ అంటే తన సహజ స్థితిలో ఉండుట. అమ్మ అంతటా ఉంటుంది. ఆవిడ గుణాతీతురాలు. శారీరకంగానూ మానసికంగానూ ఆవిడ ఎప్పుడూ చలించదు. స్థిరమైన చిత్తముతో ఉంటుంది. ఆమె సర్వ స్వతంత్రురాలు. 

చాందోగ్య ఉపనిషత్ లో

నారదుడు సనత్కుమారుడితో ఇలా అన్నాడు, "అనంతుడైన పరమాత్మ ఎక్కడ ఉంటాడు?" సనత్కుమారుడు ఇలా జవాబిచ్చాడు, "అనంతుడైన పరమాత్మ తన స్వస్థానంలో తన స్వశక్తితో ఉంటాడు."

ఒకసారి గణేశుడు ఆటలలో ఒక పిల్లిని తీవ్రంగా గాయపరుస్తాడు. ఇంటికి వెళ్లిన తరువాత పార్వతీ దేవి ఒంటినిండా గాయాలు ఉండటం చూసి ఇలా అంటాడు. "అమ్మ నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు?" అప్పుడు పార్వతి దేవి ఇలా అంటుంది. "నేను అంతటా ఉంటాను. ఇవాళ నువ్వు గాయ పరిచిన పిల్లిలో కూడా నేనే ఉన్నాను. అందుకే నీవు ఆ పిల్లిని కొట్టిన దెబ్బలు నన్ను ఇలా గాయ పరిచాయి"

Popular