Search This Blog

896. Kootasthaa


అజ్ఞానానికి అధ్యక్షురాలు. అజ్ఞానమునకు స్థానమైనది. 

మాయ అనేది మానవులను మోహంలో పడేసి సంసారసాగరంలో ముంచివేస్తుంది. అమ్మ భక్తుల యొక్క కోరికలు వెంటనే తీర్చేస్తుంది. సాధారణంగా భక్తులు ఐహికవాంఛలనే కోరతారు. ధనధాన్యాలు, పుత్రపౌత్రాదులు, సిరిసంపదలు, భోగభాగ్యాలు మొదలైనవి. ఇవి శాశ్వత సుఖాలు కావు అని ఎరుక లేనివారు సంసారలంపటంలో లోతుగా కూరుకుపోతారు.

కూటత్రయమునందుటుంది.
1. వాగ్భవ 2. కామరాజ 3. శక్తికూటాలు. వీటియందు ఉండునది పరమేశ్వరి. 

కూటము అంటే యంత్రము. శ్రీచక్రమనే యంత్రరాజంలో ఉంటుంది. కాబట్టి ఆమె కూటస్థా అనబడుతోంది.

మేరు పర్వతంలోని మధ్యకూటమినందుంటుంది కాబట్టి కూటస్థా అనబడుతోంది. 

అన్ని జీవుల యొక్క హృదయాలలో ఉంటూ కూడా, అవి చేసే కర్మలతో ఏ రకమైన సంబంధములేనిది కావటంచేత కూటస్థా అనబడుతోంది.

Divine Mother is the master of ignorance. 

Maya keeps humans in ignorance. Mother fulfills all the wishes of her children. In general people seek material things from her. As the possess them with the will of Mother, they get more entangled into the material possessions. 

She lives in the Kootatraya
1. Vaagbhava, 2.Kaamaraaja, 3. Shakti. Mother lives in these three kootas. Hence she is called kootastha

Koota means a Yantra (machine). Srichakra is the greatest of all the yantras. Hence she is called Kootastha

As she lives in the centre of the mount Meru, she is called Kootastha

Mother is present in the hearts of all beings. But still she is not effected by their karmas. Hence she is called Kootastha.

Popular