Search This Blog

813. paramantra vibhedini

ఇక్కడ 'పర' అంటే తనను ఆరాధించే వారికి విరుద్ధముగా ప్రవర్తించే వారు లేదా వారికి హాని కలిగించే వారు అని అర్ధం. అంటే మన శత్రువులు ఆవిడకీ శత్రువులే అవుతారన్నమాట. మరి అమ్మ కాపీర్ణం అదే కదా. ఎవరైనా తన పిల్లలకు హాని తలపెడతారని తెలిస్తే ఊరుకుంటుందా? వారి దగ్గరకు వెళ్లి బ్రతిమాలుతుంది, బుజ్జగిస్తుంది, శాశిస్తుంది, ఎదిరిస్తుంది చివరకు తప్పకపోతే సంహరిస్తుంది. కానీ పిల్లవాడి అదృష్టం ఎలా ఉంటే ఆలా జరుగుతుందిలే అని ఊరుకుని మాత్రం ఉండలేదు. ఉండదు. అదే అమ్మ హృదయం.

భండాసురుడు వేసిన జయవిఘ్న యంత్రాన్ని మహాగణపతితో నాశనం చేయించింది. అసురులు వేసిన రాక్షసాస్త్రాలను నాశనం చేసింది.

రోజూ అమ్మ నామం జపించే వారికి ఎటువంటి భయం కలుగకుండా వారిని అహర్నిశలూ కాపాడుతుంది.

ఇంతటితో కపర్దినీ విద్య పూర్తి అవుతుంది.

Here the word 'Para' represents those who take enmity with Mother's devotees. Those who have malefic intentions towards her children. If she knows that someone is going to harm you, she will try every trick in her treasure to avoid it. She pleads them, warns them, distracts them and if unavoidable she even kills them. But she will never leave it to your luck. That is her nature. That's her love.

In the war with Bhandaasura, she destroyed the Jaya Vighna mantra created by him to protect her army. She destroyed all the astras of Rakshasas.

Those who read Mother's names and meditate upon her daily will have no fear of anything. Because Divine Mother will always be with them to protect come what may be the problem.

This is the last name in Kapardhinee vidya.

Popular