Search This Blog

710. Sadashivapathivrata

ఎల్లకాలములందు శివుడే భర్తగా గలది. భూతభవిష్యద్వర్తమానాలలో కూడా శివుని భర్తగా పొందినది. భర్తతో అవినాభావ సంబంధం కలిగి ఉండటం పాతివ్రత్యమునకు గుర్తు. పరమేశ్వరికి సదాశివునిలో గల అన్ని విభూతులు, ధర్మాలు ఉన్నాయి. అన్నివిధాల సదాశివునితో సమానమైనది. పరమేశ్వరుడు చేసే పంచకృత్యాలయందు భాగస్వామిని.

ఒకే నాణానికి పరమేశ్వరుడు బొరుసు కాగా పరమేశ్వరి బొమ్మ. వారిది విడదీయలేని అనుబంధం. శివుడు లేకుండా శక్తి లేదు. అలాగే శక్తి లేకుండా శివుడులేదు. అందుచేత ఆమె సదాశివ పతివ్రతా అనబడుతోంది. సౌందర్య లహరిలోని 96వ శ్లోకంలో
శంకరభగవత్పాదులవారు పరమేశ్వరి పాతివ్రత్యాన్ని వివరిస్తూ....

కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతి: కై రపి ధనైః
మహాదేవం హిత్వా తవ సతి సతీనామ చరమే
కుచాభ్యా మాసంగ కురవకతరో రస్య సులభః ||

తల్లీ ! లోకంలో కవీశ్వరుడు లేక పండితుడు - సరస్వతీ పతి అవుతాడు. ధనవంతుడు లక్ష్మీపతి అవుతాడు. కాని పార్వతీపతి మాత్రము మహాదేవుడు ఒక్కడే అంటారు.

Shiva and Shakti are described as husband and wife. They are like two sides of a coin. Without Shakti, we can never reach Shiva. Without Shiva, there is no meaning for Shakti. They are like a word and its meaning.

A pativrata is a wife whose thoughts are always aligned with her husband. She who always thinks of her husband's success and wellbeing. Divine mother is such pathivratha. She is omnipotent. But she performs panchakrutyas (Srushti, Sthiti, Laya, Tirodhana, anugraha) as per vedas given be Sada Shiva.

It is described like this in 96th Shloka of Soundarya Lahari

Kalatram vaidhatram kathikathi bhajante na kavayah
Sriyo devyaah ko vaa na bhavathi patih kai rapi dhanaih
Mahaadevam hitvaa tawa sathi sathiinaama charame
kuchaabhyaa maasanga kuravakataro rasya sulabhah

O! Divine mother! A learned pandit is called Saraswathi pathi. A rich man is called Lakshmi pathi. But only Sada shiva is always called Parvathi pathi.

Popular