Search This Blog

708. Guhyaroopini

అమ్మ దహరాకాశరూపంలో ఉంటుంది. కాబట్టి గుహ్యరూపిణీ అనబడుతుంది.
Divine Mother stays in Daharaakasha. So she is called Guhya roopini.

రహస్యమైనది. జ్ఞానరూపిణి, సూతసంహితలో
Divine Mother stays in the form of pure consciousness. common people are not aware of it. It is said like this in Sootha samhita

గురుమూర్తిధరాం గుహ్యం గుహ్య విజ్ఞాన రూపిణీం |

గుహ్యభక్తజన ప్రీతాం గుహాయాం నిహితం నమః ||
Gurumurthydharaam guhyam guhya vignaana roopineem
Guhyabhaktajana preetaam guhaayaam nihitam namah

గురుమూర్తి అయిన దానిని, రహస్యమైనదానిని, రహస్యజ్ఞానస్వరూపిణిని, రహస్యభక్తులకు ప్రీతి గలిగించు దానిని గుహ యందుండే దేవికి నమస్కరిస్తున్నాను.
I bow to her who is the form of Guru. Who is known only to the most knowledgeable. Who stays in the cave(Daharaakaasha).

బ్రహ్మ ఒక్కడే అయినా రెండు రూపాలు పొందుతున్నాడు. అయితే ఈ ద్వైతం ఎక్కువకాలం సాగదు. అది నిజమని కొంతకాలమే అనిపిస్తుంది. అద్వైతమే నిత్యము. ఇది పరమరహస్యమైనది. సామాన్యుడికి అర్ధం కాదు.
Though Parambrahma is the only one, we perceive many different things. This is dwaita. It is illusion. It does not stay for long. Adwaita says parabrahma is the only one. That is truth.

సర్వోపనిషదాం దేవీ గుహ్యోపనిష దువ్యసే
Sarvopanishadaam devi guhyopanishadavyase

అన్ని ఉపనిషత్తులలోకి ఆ పరమేశ్వరి గుహ్యోపనిషత్తు.
Divine mother is the underlying secret meaning of all upanishats.


Popular