Search This Blog

550. Vidya

విద్య అంటే జ్ఞానరూపమైనది, మోక్షదాయకమైనది విద్య. దేవీ మాహాత్మ్యంలో “ఆ పరాశక్తి విద్యగా ఉన్నది" అని చెప్పబడింది. గౌడపాదులవారు కూడా పరమేశ్వరియే విద్య అని చెబుతున్నారు. మాయతో కూడినది అవిద్య. మాయలేనిది జ్ఞానము. అని శైవతంత్రంలో చెప్పారు. విద్యయే స్వరూపంగా గల దేవి. దేవి వేదస్వరూపిణి. జ్ఞానస్వరూపిణి. కంటికి కనిపించే వాటి సాయంతో కంటికి కనిపించని దాన్ని కొనుక్కొవటమే విద్య అనబడుతుంది. దేనిచేత అక్షరపరబ్రహ్మను గురించి తెలుసుకోగలమో అది విద్య.

వేదంలో రెండురకాల విద్యలు చెప్పబడ్డాయి. 1. అపరావిద్య 2. పరావిద్య. ముండకోపనిషత్తులో వీటిని వివరించటం జరిగింది. శునకుని కుమారుడు శౌనకుడు విద్యాభ్యాసం పూర్తిచేసి గృహస్థాశ్రమం స్వీకరించటానికి విముఖుడై తన గురువైన అంగిరసుణ్ణి అడుగుతాడు. "అర్యా ! దేన్ని గురించి తెలుసుకుంటే నాకు సర్వమూ తెలుస్తుందో, దాన్ని గురించి వివరించండి” అంటాడు. దానికి అంగిరసుడు “నాయనాలోకంలో తెలుసుకోవలసిన విద్యలు రెండు ఉన్నాయి. 1. అపరావిద్య 2. పరావిద్య.

అపరావిద్య లౌకిక ప్రయోజనాలకు వర్తిస్తుంది. బుద్ధి సంపన్నులైన మహర్షులు యజ్ఞకర్మలు చేస్తారు. యజ్ఞాలవల్ల పుణ్యలోకాలు కలుగుతాయి. లోకంలో మనం చేసే కర్మలన్నింటివల్లా పుణ్యఫలం కలుగుతుంది. తద్వారా సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఉన్నత పదవులు కలుగుతాయి. పరావిద్య అంటే మోక్షవిద్య, సర్వ సంఘ పరిత్యాగం చేసి విరాగి అయినవాడు మాత్రమే అనుసరించగలిగినది. సాధకుడికి మోక్షమార్గం చూపేది. ముందుగా అపరావిద్యనుపాసించి, కర్మఫలాన్నననుభవించి, ఆ తరువాత పరావిద్యను తెలుసుకోవాలి అంటాడు.

అలాగే ఛాందోగ్యోపనిషత్తులో దేవర్షి అయిన నారదుడు సనత్కుమారుని దగ్గరకుపోయి, స్వామి గతంలో నేను వేదవేదాంగాలు ఉపనిషత్తులు, చతుషష్టి కళలు, సర్వశాస్త్రాలు అభ్యసించాను. సంగీతసాధన చేశాను. కానీ నాకు మనశ్శాంతి లేదు. ఆత్మజ్ఞానం కలగలేదు. కాబట్టి నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి, దుఃఖవిమోచన కలిగించండి అంటాడు. తరువాత సనత్కుమారుడు నారదుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు.

కాబట్టి విద్య అనేది పరావిద్య. జ్ఞానస్వరూపం. అపరావిద్య పూర్తిగా తెలిసిన తరువాతనే పరావిద్య లభ్యమవుతుంది. పరమేశ్వరియే జ్ఞానస్వరూపం. కాబట్టి విద్యా అంటే ఆ పరమేశ్వరియే కాని వేరుకాదు.

She who is embodiment of true knowledge. She who helps in liberation. In Devi Mahatyam, it is said that Divine Mother is Vidya. The same is acknowledged by Sri Goudapada acharya. Shaiva Tantra said, "One with Maya(illusion) is Avidya. One without Maya is Vidya". Vidya is the process of understanding the one that is not perceivable with whatever information that can be procured with the help of senses.

In vedas, it is explained that Vidya is of two types. 1.Apara Vidya 2. Para Vidya. There is a good description of these in Mandukopanishath. After finishing his studies, Shounaka, son of Shunaka approaches his guru Sri Angeerasa and asks like this, "Hey guru! Knowledge of what will make me known of everything? I want to know about it. Please teach me". To that, Sri Angeerasa replies, "Vidya is of two types. 1.Apara, 2.Para.

Apara helps you for your mundane activities. It is required for performing virtuous deeds like Yagnas. That gives you good fame and money. It gives you luxuries and power. Para vidya means the one that helps you in attaining Moksha. Only those who left behind all the worldly bonds should pursue this. One should first learn Apara vidya and experience the karma and its result. After that one should pursue para vidya"

There is a similar discussion in Chandogya upanishath. Devarshi Narada approaches Sri Sanath Kumara and says like this. "Hey guru! Till now, I have learnt Vedas and Vedangas. I learnt Upanishaths. I also learnt about all the 64 vocational studies. I learnt music also. But nothing gave me eternal peace. I still did not achieve self-realization. So I seek your guidance to attain self-realization." Then sage Sanath Kumara teaches Brahma Vidya (Para Vidya) to Devarshi Narada.

So that means one has to learn apara vidya first. Then he/she should experience the karma and results. Then they should pursue para vidya.

Popular