Search This Blog

04. చిదగ్నికుండ సంభూత


చిత్ మన మెదడులోని ఒక భాగం. ఇది నిరంతరం ఆనందం కోరుకుంటుంది. దీని నుంచే చైతన్యమ్ పుడుతుంది. ఇది ఎల్లప్పుడూ పని చేస్తూ ఉంటుంది. అలసి పోదు.

మొదట ఇది మన అనుభవాలను ఇష్టాలు లేదా అయిష్టాలుగా నమోదు చేస్తుంది. అప్పుడు అది మనల్ని ఇష్టాల వైపు ప్రోత్సహిస్తు అయిష్టాల నుండి నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. దీని ప్రభావం వలెనే మనిషి తనకు ఇష్టమైన పనులు చేస్తూ అయిష్టాలను నిరాకరిస్తూ ఉంటాడు.

ఇది చాలా త్వరగా విసిగి పోతుంది. ఎక్కువ కాలం పాటు దేనితోనూ ఉండలేదు. దీని ప్రభావం వలెనే ఇష్టమైనప్పటికీ మనమ్ ఒకే పనిని ఎల్లపుడు చేయలేము. తద్వారా ఇది మనల్ని అనేక విషయాల మధ్య భ్రమింపజేస్తుంది. రోజంతా ఏదో ఒకే పని చేయడం వల్ల మనిషి ఎందుకు సంతోషంగా ఉండలేడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిత్ దానికి కారణం.

కానీ చిత్ ఆత్మ ఆనందాన్ని అనుభవించినప్పుడు విసుగు చెందదు. ఎంతసేపైనా అలాగే ఆత్మ స్వరూపాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోగలదు. అందుకే ఆత్మానందాన్ని సచ్చితానంద అని పిలుస్తారు - నిజమైన ఆనందం. చిత్ కు ఎల్లప్పుడూ క్రొత్తది.

భండసురుడు ఎవరు?

భండసురుడు చైతన్యం లేని రాక్షసుడు. అతను క్రియారహితంగా ఉంటాడు. ఎలాంటి ప్రేరణ ఉండదు. ఒకవేళ అతను ఏదైనా చేసినా, అది హాని కలిగించేదిగా (తనకు లేదా ఇతరులకు) ఉంటుంది. అతను ఆత్మ సాక్షాత్కారం (మోక్షం) గురించి ఎప్పుడూ ఆలోచించడు. ధర్మాన్ని అనుసరించడు. తనకు నచ్చినది చేయడమే సరైనది అనే భ్రమలో ఉంటాడు. తాను చేసేది వేద గురువులు లేదా పండితులు చెప్పేదానికి వ్యతిరేకంగా ఉందొ లేదో అని అవలోకించి చూడడు. అతను అందరికన్నా గొప్పవాడని మరియు అందువల్ల తనకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని భావిస్తాడు. చివరగా, అతను కేవలం భౌతిక (శరీరానికి సంబంధించిన) సుఖాల కొరకు మాత్రమే సమయమంతా గడుపుతాడు. భండాసూరునికి, మృగానికి మధ్య తేడా లేదు!

లలితా దేవి జననం:

దేవతలు రక్షించమని ప్రార్థించినప్పుడు, భండాసూరుడిని సంహరించడానికి లలితా దేవి చిదగ్ని నుండి ఉద్భవించింది. ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం. అసలు భండసూరుడు ఎవరు? వాస్తవానికి చిదగ్ని ఎక్కడ ఉంది? మనం ఆ అగ్నిని వెలిగించి, లలితమ్మను మనలోనే చూడగలమా?

చిత్:

మంచి అవగాహన కోసం, ఒక సాధారణ వ్యక్తి యొక్క చిత్ ఎలా ఉంటుందో వివరిస్తాను. పైన చెప్పిన విధంగానే చిత్ లోపల ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. అవి ఈ ప్రకారంగా ఉంటాయి:

ఇష్టాలు - నేను, భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంగాళాదుంప, చికెన్, నూనెలో వేయించిన పదార్ధాలు, బంగారం, సెల్ ఫోన్, టీవీ, కారు, మొ... వీటికి సంబంధించిన విషయాలు చిత్ చే ప్రోత్సహించ బడతాయి.

అయిష్టాలు - పైఅధికారులు, పెందరాళే లేవడం, అత్తమామలు, పొరుగింటివారు మొ... వీటికి సంబదించిన విషయాలు చిట్ చే నిరుత్సాహపరచ బడతాయి.

మీమాంసలు - ధర్మం. ఇది తటస్థ మండలంలో ఉంటుంది. ఇక్కడ తటస్థ మండలం అంటే ఇష్టము కాదు అయిష్టము కాదు. ఇది ఏదైనా అయిష్టాలతో కూడి ఉన్నపుడు చిత్ దానిని వ్యతిరేకిస్తుంది. ఇష్టాలతో కూడి ఉన్నపుడు ధర్మం అనుసరించబడుతుంది. ఇష్టాయిష్టాల కారణంగా మనం ఒక్కొక్కసారి ధర్మాన్ని అతిక్రమించినా ఆనందం పొందవచ్చు అని అనుకుంటాము. కానీ నిజానికి ధర్మాన్ని విస్మరించిన ప్రతిసారీ, మనం మరిన్ని కష్టాలు కొని తెచ్చుకుంటాం.

మనలోని దేవగణాల ప్రార్ధన వలన చిదగ్ని రగులుతుంది. చైతన్యం కలుగుతుంది. బ్రహ్మ సత్యం జగన్మిధ్యా అనే ఆలోచన మొదలవుతుంది. ధర్మాధర్మాల మధ్య (అంటే భండునితో) సంఘర్షణ మొదలవుతుంది. అప్పుడు లలితమ్మ వస్తుంది. వాడిని సంహరిస్తుంది. అమ్మ భండుడిని సంహరించిన పిదప చిత్ ఈ విధంగా మారిపోతుంది.

ఇష్టాలు - ధర్మం. అన్ని వేళలా ధర్మమే పాటిస్తారు.

మీమాంసలు - తక్కినవన్ని. సందర్భానుసారంగా ధర్మ-అధర్మ విచక్షణ జరుగుతూ ఉంటుంది.

అయిష్టాలు - అధర్మం. అన్ని వేళల అధర్మం నిరాకరించ బడుతుంది.


చిదగ్నికుండమే కులకుండము. అక్కడనుంచి కుండలినిగా(110వ నామము) పైకి లేస్తుంది కాబట్టి చిదగ్నికుండ సంభూతా అన్నారు.

Popular