Search This Blog

366.Paraa

366 నుండి 374 వరకు ఉన్న నామాలలో వాక్కు గురించి వివరణ ఉంటుంది.

వాక్కుకు నాలుగు రూపాలున్నాయి. అవి. 1. పరా 2. పశ్యంతీ 3. మధ్యమా 4. వైఖరి.

పరాస్థానం వాక్కుకు ప్రధమస్థానం. అక్కడ ఆలోచన పుడుతుంది. ఆ తరువాత పశ్యంతీస్థానం రెండవది. ఏదైనా విషయం చెప్పాలి అంటే ముందుగా ఆలోచన రావాలి. అదే పరావాక్కు ఆ తరువాత వాక్కు ఆధారచక్రం నుండి బయలుదేరి నెమ్మదిగా స్వాధిష్ఠానమణిపూరాలు దాటి అనాహంతచేరి అక్కడ నుండి కంఠస్థానమైన విశుద్ధిచేరి, ముఖం ద్వారా స్పష్టమైన వైఖరీ వాక్కుగా, నామరూపాత్మకమైనదిగా బయటకు వచ్చి శబ్దతరంగాలుగా చెవి రంధ్రాన్ని చేరుతుంది.

పరావాక్కు - ప్రత్యక్చితీ రూపం గలది. అంటే అవ్యక్తమైనది

పశ్యంతీవాక్కు - పరదేవతా అనబడుతుంది. ఇది పూర్తి అస్పష్టమైనది. అప్పుడే పుట్టిన పిల్లవాడి ఏడుపులా ఉంటుంది.

మధ్యమావాక్కు - పూర్తిగా అస్పష్టం కాదు. అలా అని స్పష్టమూ కాదు. మాటలు వచ్చీరాని పిల్లలు మాట్లాడినట్లుంటుంది. ఇది పూర్తిగా హల్లులతో కూడినది.

వైఖరీవాక్కు - ఇది స్పష్టమైన వాక్కు

ఇది వాక్కు యొక్క స్వరూపం. వాగీశ్వరీదేవి. ఈ దేవి సదా తనను ధ్యానించే భక్తుల హృదయాలలో ఉంటుంది.

The names from 366 to 374 explain about the faculty of speech

Speech is in four forms. They are 1)Paraa, 2)Pasyanti, 3)Madhyama, 4)Vaikhari

When you have to speak out anything, it first starts as a thought in the Mind. This thought is called 'Paraa'. This thought moves from mind to Moolaadhaara. There it originates as a subtle sound. It is very unclear in this stage. Like the crying sound of an infant. This is called 'Pasyanti'. It is impossible to understand what the speaker is trying to say in this stage

From Moolaadhaara, the sound reaches 'Anahata'. Here it develops all the consonant sounds. It is not completely unclear. Not is it fully clear. This sound is called 'Madhyama'. If we have prior context we can try to understand the speakers intention with Madhyama. But we cannot confidently say what his intention is?

From Anahata, the sound goes up to Vishuddhi. Here the speech is enriched sounds of vowels. This is Vaikhari. This comes out of the mouth as clear speech.

Popular