Search This Blog

235:Chatushastyupacharadya

Human wants are unlimited. Generally, people have few wishes fulfilled and few unfulfilled. During worship, the subject offers what he has to God. This offering is distributed to all others after the pooja as 'prasad'. That means when his wish is fulfilled, the subject will not enjoy the fruits by himself. He will distribute it among his fellow members. By doing this, he will enter the good books of almighty. Noticing his generosity, God will fulfill any unfulfilled wishes of the subject.

'Upacahara' means to offer our possessions to God. In 'Shodashopachara' we offer 16 possessions to God. In 'Chatushastyupachara' we offer 64 possessions to God. 'Chatushastyupachara' is done only to Divine mother. That means after offering 64 possessions, there is nothing left in the material world to fulfill. So divine mother will liberate him(Moksha).

జీవులకు అనేక రకమైన కోరికలు ఉంటాయి. కానీ అవన్నీ ఏక కాలంలో తీరవు. కొన్ని తీరిన కోరికలు ఉంటాయి. కొన్ని తీరని కోరికలు ఉంటాయి. పూజ చేసినప్పుడు తనకున్నదానిని దేవునికి అర్పించి తనకు లేని దానిని కోరుకుంటారు. ఆ విధంగా దేవునికి అర్పించిన దానిని ప్రసాదంగా అందరికి పంచుతారు. అంటే ఆ పూజ కర్త తనకున్న ఐశ్వర్యాన్ని అందరికి పంచి భగవంతునికి ప్రీతిపాత్రుడవుతాడు. అతని దానగుణానికి మెచ్చి దేవుడు అతనికి తీరని కోరికలేమైనా ఉంటె అవి కూడా తీరుస్తాడు. మనమందరము అమ్మ బిడ్డలే కదా. ఎవరైతే తనతోపాటు తక్కిన వారినికూడా ఉద్ధరిస్తూ ఉంటాడో అటువంటి వారిని అమ్మ కోరికలు తీర్చి ఇంకా ప్రోత్సహిస్తుంది.

ఇలా మనకున్న దానిని భగవంతునికి అర్పించడమే ఉపచారము. సాధారణ పూజ, షోడశోపచార(16) పూజ చతుషష్ట్యుపచార(64) పూజ అని మూడు రకాల పూజలు ఉన్నాయి. ఇందులో మూడవది కేవలం అమ్మకే చేస్తారు. 64 రకాల ఉపచారాలు అమ్మకు చేస్తే ఇక ఐహికంగా తీరని కోరికలు ఏమి లేనట్లే. అప్పుడు అమ్మ వారికి మోక్షం ప్రసాదిస్తుంది. 

Popular