Search This Blog

223-225.Mahabuddhih...Mahayogeshwareswari

223.Mahabhudhih
Our intellect(buddhi) is driven by karma. Those who seek self realization pray Divine mother to find out the path towards it. Then she diverts buddhi towards Atma. From then onwards, their buddhi will be driven by Atma and not karma. Because she diverts the seekers buddhi towards Atma, she is called Mahabuddhi.

224.Mahasidhih
Siddhi are of two types. 1) Kaarya Siddhi, 2) Deva Siddhis. The super set of all kaarya and deva siddhis is Maha siddhi. Divine mother gives all siddhis to those who pray her with devotion. 

    Deva siddhis - 
        
        1.Anima - To be able to reduce the size of the body to infinitesmal
        2.Mahima - To be able to increase the size of the body to infinitesmal
        3.Garima - To be able to increase the weight of the body to required level
        4.Laghima - To be able to reduce the weight of the body and become very light
        5.Praapti - To be able to possess anything
        6.Prakamyamu - To be able to navigate in the sky
        7.Eeshwatamu - To be able to show authority on everything
        8.Vashitvamu - To be able to hypnotize and control

    Kaarya siddhis - 

        1.Vidya - Having knowledge and wisdom
        2.Dhana - Having enough money
        3.Dhaanya - Having enough food
        4.Oushadha - Being healthy
        5.Rasamu - Being happy, contended.

225.Mahayogeshwareshwari
Yoga means union of soul with God. Yoga is of three types:
1. Bhakti yoga - Seeing God in everybody and not differentiating between self and others is called bhakti yoga.
2. Karma yoga - Performing yagna, yaga and pooja without any interest on the result is Karma yoga
3. Gnana yoga - Being aware that God is the only truth and rest all is Maya(illusion), having mind deserted of all wants and meditating upon God is Gnana yoga. This is very tough.

A yogeeshwara is one who mastered one of these yogas. Divine mother is the master of all the yogeeshwaras. Hence she is Maha yogeshwareshwari

223.మహాబద్ధిహ్
బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. అంటే కర్మ వలన బుద్ధి ప్రేరేపింపబడుతుంది. అయితే యోగులు, మోక్ష కాముకులు అమ్మను ప్రార్ధిస్తే ఆవిడ వారి బుద్ధిని ఆత్మచే ప్రేరేపింపజేస్తుంది. అప్పుడు వారికి మోక్ష మార్గం గోచరిస్తుంది. బుద్ధిని కర్మనుండి ఆత్మ వైపు మళ్ళిస్తుంది కనుక ఆవిడ మహా బుద్ధి. 

224.మహాసిద్ధిహ్
సిద్ధులు రెండు రకాలు. 1) కార్య సిద్ధులు, 2) దైవ సిద్ధులు. ఈ కార్య సిద్ధులు, దైవ సిద్ధులు రెండు కలిస్తే మహా సిద్ధి అవుతుంది. అమ్మను భక్తితో కొలిచిన వారికి సర్వ సిద్ధులు లభిస్తాయి.

సిద్ధులు రెండు రకాలు. 1) కార్య సిద్ధులు, 2) దైవ సిద్ధులు. ఈ కార్య సిద్ధులు, దైవ సిద్ధులు రెండు కలిస్తే మహా సిద్ధి అవుతుంది. అమ్మను భక్తితో కొలిచిన వారికి సర్వ సిద్ధులు లభిస్తాయి. 

దైవ సిద్ధులు -
1.అణిమ - శరీరమును అతి చిన్నదిగా చేయగలుగుట 
2.మహిమ - శరీరమును అతి పెద్దదిగా చేయగలుగుట
3.గరిమ - శరీరము బరువు విపరీతంగా పెంచ గలుగుట 
4.లఘిమ - శరీరమును అతి తేలికగా చేయగలుగుట
5.ప్రాప్తి - కావలిసిన వస్తువులను పొందగలుగుట
6.ప్రాకామ్యము - ఆకాశ సంచారము చేయగలుగుట
7.ఈశ్వతము - సమస్థానికి ఆధిపత్యము పొందుట 
8.వశిత్వము - సమస్త భూతములను వశపరచుకోగలుగుట 
కార్య సిద్ధిలు - 
1.విద్య - చదువు, జ్ఞానము, తెలివితేటలు కలిగి ఉండుట 
2.ధన - కావలసినంత ధనము కలిగి ఉండుట. 
3.ధాన్య - తగినంత ఆహారము సేవించ గలుగుట 
4.ఔషధ - ఆరోగ్యము కలిగి ఉండుట 
5.రసము - సంతృప్తి, సంతోషము కలిగి ఉండుట

225.మహాయోగీశ్వరేశ్వరీ
యోగము అంటే జీవాత్మ, పరమాత్మల కలయిక. యోగము 3 రకాలు.
1. భక్తి యోగము - అందరిలోనూ ఈశ్వరుడున్నాడని భవిస్తూ, తన - పర అను భేదము లేకుండా నిత్యం భగవధ్యానంలో ఉండటం భక్తి యోగము.
2. కర్మ యోగము - ఫలాపేక్ష లేకుండా యజ్ఞ యాగాది క్రతువులు జరపడం, నిత్యా నైమిత్తిక కర్మలు చేయడం కర్మ యోగము.
3. జ్ఞానం యోగము - బ్రహ్మ సత్యం జగన్మిధ్యా అని ఎరుకలో ఉంటూ కోరికలు లేనివాడై, పరమాత్మనే ధ్యానించుట జ్ఞాన యోగం. ఇది దుర్లభం.

ఈ యోగాలలో నిష్ణాతులను యోగీశ్వరులంటారు. అటువంటి యోగీశ్వరులకు ఈశ్వరి కాబట్టి మహా యోగీశ్వరీస్వరి.

Popular