Sandrakaruna means full of mercy. Divine mother is mother of 84 lakh species. Her love is unconditional for any living being. Even for wild animals like Tiger, jackal etc. So she is full of love and mercy towards her children. She is not satisfied by basic comforts to her children. Otherwise, she would created one fruit or grain or vegetable and leave us to eat it to satisfy our hunger. She created 1500 varieties of just mangoes. 50 varieties of grains. She kept sweet dates in the middle of a desert. Made oxygen freely available in air. Made D-vitamin available with exposure to sunlight so that we don't have to struggle for these basic necessities. With this love and affection, she made many many wonders in this nature. So she is called 'saandra karuna'
సాంద్ర కరుణ అంటే అపారమైన దయ కలది. ఏ జీవికైనా తన బిడ్డలమీద అంతులేని దయ ఉంటుంది. అందులోను అమ్మలకైతే ఇక చెప్పక్కర్లేదు. చివరికి క్రూర మృగాల జాతులైన పులి, నక్క, తోడేలు మొదలైనవైనా సరే. అమ్మ అమ్మే. తన బిడ్డల సంతోషమే తన జీవిత లక్ష్యంగా భవిస్తుంది. మరి ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులకూ అమ్మ ఆ జగన్మాతే. ఇక ఆవిడ దయ గురించి మనం చెప్ప గలమా? ఎదో ఓక రకంగా బిడ్డ ఆకలి తీరిస్తే చాలు అనే భావన ఉన్నట్లయితే ఎదో ఒక పండో, కాయో ఇచ్చి ఊరికోవచ్చు. కానీ జగన్మాత అలాగ కాదు. 1500 రకాల మావిడి పళ్ళను సృష్టిస్తుంది. 50 రకాల ధాన్యపు గింజలను సృష్టిస్తుంది. ఎడారిలో తీయని ఖర్జూర ఫలాన్ని పుట్టిస్తుంది. ఉచితంగా దొరికే గాలిలో ప్రాణ వాయువు నింపుతుంది. సూర్య రశ్మితో డి విటమిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అపారమైన దయతో, ప్రేమతో ఆవిడ ఎన్నో అద్భుతాలు చేసింది. అందుకే సాంద్ర కరుణ అన్నారు.