Search This Blog

188-190 - Durlabha Durgama Durga

188. Durlabha
'Durlabha' means not easily obtainable. Divine mother is an ocean of mercy. But unfortunately, we still can't reach her easily. Ego is the reason for this. Thoughts of I and mine have created a negative bias in our mind. These folds go into much deeper cores of our mind. By meditating upon mother's mantra, the vibrations of it's beejaksharas remove unwanted folds from the grey matter. But only those with steadfast devotion and unfettered determination can do this.
189.Durgama
'Durgama' means not easily reachable. As explained in previous name, it is not easy to reach DivineMother's state of consciousness. One has to approach learned gurus who already possessed it and willing to teach. One can't do it on his own.
190.Durga
She is called as Durga because she killed a demon called Durgama. Durga is the nine year old girl we pray during Navaratri.

188.దుర్లభా
దుర్లభ అంటే చాల సులభముగా లభించదు అని అర్ధం. అమ్మ అవ్యాజమైన కరుణా మూర్తి.  అయినా మనకు ఆవిడ సాన్నిధ్యం సులభముగా లభించకపోవడం మన దురదృష్టం. మనలోని అహంభావమే దీనికి కారణం. నేను, నాకు, నాది అనే భావన మన మెదడు ముడతలలో లోలోతుల్లోకి చొచ్చుకుపోయి ఉన్నది. దానిని పూర్తిగా రూపుమాపాలి. అంటే అమ్మ మంత్రం నిరంతరం ధ్యానం చేయాలి. ఆ మంత్రంలోని బీజాక్షర ధ్వని ప్రకంపనలు మెదడులోని అనవసరమైన ముడతలను తొలగించేస్తాయి. కానీ దీనికి సుదీర్ఘమైన సాధన అవసరం. భక్తి, శ్రద్ధ, దీక్ష, పట్టుదల ఉన్నవాళ్లే దీనిని సాధించగలుగుతారు. 
189.దుర్గమా
దుర్గమ అంటే సులువుగా పొంద సఖ్యము కానిది. అమ్మ సాయుజ్యమును పొందిన జ్ఞానులను, గురువులను ఆశ్రయించి వారి శిక్షణతో ఆ స్థితిని చేరుకో గలుగుతాము. 
190.దుర్గా
దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది కనుక దుర్గ అని పిలవబడుతోంది. దేవినవరాత్రులలో 9 సంవత్సరాల బాలిక కొలిచేది దుర్గానే.

Popular