Search This Blog

134-137. Nirlepa Nirmala Nithya Nirakara

134.Nirlepa - Divine Mother is beyond illusion. She helps us in overcoming the illusion. 'Bhaga' means part. 'Bhagavan' means one that is present in all parts. So if One is present in all parts, then there is no room for a second thing. That means 'Bhagavan' is the only One present. He is present everywhere and in everything. Being aware of this is 'Gnyana'. Not being aware of this is illusion.

135.Nirmala - 'Mala' means impurity. The soul is always pure and no impurity can ever touch it. So it is called Nirmala.

136.Nithya - 'Jayate gacchate iti jagat'. The one which comes and goes is 'Jagat'. Jagat is the sanskrit word that represents this world. Everything in this jagat has a birthdate and a death date. But our mother is beyond this. She is eternal.

137.Nirakara - 'namarupatmaka mayam idam jagat'. Everything in this world has a form/shape and a name. But divine mother is beyond 'jagat'. So she is form less. Another interpretation of this is that every form in this jagat is her's. So it is not possible to assign a specific and particular form to her.

134.నిర్లేపా - మాయకు ఆమె అతీతురాలు. ఆమెను ఆశ్రయించినవారిని మాయనుండి కాపాడుతుంది. భగవంతుడు అంటే ప్రతీ భాగంలోనూ ఉండేవాడు అని అర్ధం. భగవంతుడే అన్ని, అంతటా ఉన్నది పరమాత్మే, ఉన్నది అది ఒక్కటే, రెండవది లేదు అని ఎరుకలో ఉండడమే జ్ఞానము. లేనిచో అజ్ఞాము/మాయ. 

135.నిర్మల - మలము అంటే కల్మషము, అశుద్ధము, ముఱికి మొదలగునవి. ఇవేవి ఆత్మను తాకలేవు. ఆత్మ నిర్మలము. 

136.నిత్య - జాయతే గచ్ఛతే ఇతి జగత్. ఈ జగత్తులోని ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి పుట్టినరోజు గిట్టినరోజు అని రెండు తప్పనిసరిగా ఉంటాయి. కానీ మన అమ్మ దీనికి అతీతమైనది. 

137. నిరాకార - 'నామరూపాత్మక మయం ఇదం జగత్'. అనగా ఈ జగత్తులో ఉన్న వాటన్నింటికి నామం రూపం ఉంటుంది. కానీ అమ్మ జగత్తునకు అతీతమైంది. కనుక ఆమెకు ఆకారం రూపం ఉండవు. ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. ఈ జగత్తులోని రూపాలన్నీ అమ్మవే. ఒక ప్రత్యేకమైన ఆకారం ఉందని చెప్పలేము కనుక నిరాకార. 

Popular