Search This Blog

19-20. Navachampaka...nasabharana bhaasura

 


నవచంపకం అంటే అప్పుడే వికసించడం మొదలైన చంపక పుష్పం. ఇంకా పూర్తిగా వికసించలేదు. అటువంటి చంపకానికి ఉండే రేకు ఏ ఆకారంలో ఉంటుందో అలా ఉందిట అమ్మవారి ముక్కు. అందుకే నవచంపక పుష్పాభా నాసా దండ విరాజితా అన్నారు. ఇక అమ్మవారి నాసాభరణం తారల కాంతిసైతం చిన్నబుచ్చుకునేలా మెరిసిపోతోందిట. అందుకే తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురా అని అన్నారు. 

ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఒకటి చెప్పుకోవాలి. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. రహస్యాలలోకెల్లా అతి గొప్ప రహస్యం. మనమందరం సాధారణంగా శ్వాస తీసుకుంటున్నపుడు గాలిని కుడి రంధ్రం నుండి లోపలికి తీసుకుని, ఎడమ రంధ్రం నుండి బయటకు వదులుతాము. కానీ లోతుగా ధ్యానం చేసుకుంటున్నపుడు మాత్రం శ్వాస ఎడమ ముక్కు రంధ్రం ద్వారా లోపలికి వెళ్లి కుడి ముక్కు రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ శ్వాస ప్రక్రియ ఎలా మారిందో ఎప్పుడు మారిందో ధ్యానం చేస్తున్నప్పుడు తెలియదు. ఎందుకంటే అపుడు దృష్టి అంతర్ముఖమైపోయి ఉంటుంది. ధ్యానం ముగించి తెలివిలోకి వచ్చాక తెలుసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అప్పటికి శ్వాస మళ్లి మామూలుగా మారిపోతుంది. ఈ శ్వాస గమనంలోని మార్పే కుండలిని యోగానికి మూలం. 

Navachampakam means Champaka flower which is just beginning to bloom. It has not yet fully bloomed. The shape of the foil of such a champaka resembles Divine Mother's nose. That is why it is described as Navachampaka Pushpabha Nasaa Danda Virajita. The mother's nose ring is shining brighter than the brightest of the stars. That is why it is called Tarakanti Tiraskaara Nasabharana Bhasura.

We should discuss an amazing thing here. It is a wonderful fact. The greatest of all the secrets. When we all breathe normally we take in air from the right nostril and exhale it out of the left nostril. But when meditating deeply the breath goes in through the left nostril and comes out through the right nostril. One will not realize how or when this breathing process changed while meditating . Because the focus is diverted to inner consciousness. There is no chance of knowing it after the meditation is over and you come back to outer consciousness. Because by then the breathing will be back to normal. This reversal of the breathe cycle is the corner stone of kundalini yoga.

Popular