Search This Blog

977.Dasamudra samaradhya



శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. వీటిలో ఒక్కో ఆవరణలో ఒక్కో దేవత ఉంటుంది. శ్రీచక్రార్చనలో ఒక్కో ఆవరణలో ఒక్కో ముద్రను ప్రదర్శించాలి. సర్వసంక్షోభిణీముద్ర - భూపురము, సర్వవిద్రావిణీముద్ర - షోడశదళము, సర్వాకర్షిణీముద్ర - అష్టదళము, సర్వవశంకరీముద్ర - మన్వస్రము, సర్వోన్మాదినీముద్ర - బహిర్దశారము, సర్వమహాంకుశముద్ర - అంతర్దశారము, సర్వఖేచరీముద్ర - అష్టకోణము, సర్వబీజముద్ర - త్రికోణము, సర్వయోనిముద్ర - బిందువు, సర్వత్రిఖండముద్ర - శ్రీచక్రమంతా. సర్వత్రిఖండముద్ర త్రిపురసుందరి రూపం. ఇది శ్రీచక్రమంతా వ్యాపించి ఉంటుంది. ముద్రలను ప్రదర్శించేటప్పుడు కుడి చేతివేళ్ళు, ఎడమ చేతి వేళ్ళు కలుపుతారు. కుడిచేతి వేళ్ళు శివ తత్త్వము. ఎడమచేతి వేళ్ళు శక్తి తత్త్వము. ముద్రలను ప్రదర్శించడమంటే శివ శక్తుల కలయికే. అదే సృష్టికి ప్రతీక. ఈ ముద్రలను ప్రదర్శించటంలో సంప్రదాయ భేదం ఉన్నది. కాబట్టి ముద్రలను వారి వారి సంప్రదాయాలను బట్టి గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. 

Sri chakra has 9 stages. Each stage has a presiding deity. Each stage will have its own mudra in Srichakra worship. Sarvasankshobhineemudra - Bhupura, Sarvavidraavineemudra - shodashadalamu, Sarvaakarshineemudra - ashtadalamu, Sarvavashankareemudra - manvasramu, Sarvonmaadineemudra - Bahirdashaaramu, Sarvamahaankushamudra - andardashaaramu, Sarvakhechareemudra - Ashtakonamu, Sarvabeejamudra - Trikonamu, Sarvayonimudra - Binduvu, Sarvatrikhandamudra - All over Sri Chakra. The fingers of left and right hands are joined while doing mudras. Right hand fingers represent Shiva. Left hand fingers represent Shakti. Doing mudras is same as union of Shiva and Shakti. That is the mark of creation. There is a difference of opinion in presentation of these mudras. So, it is advised that one should take proper initiation from a learned Guru and practice them.

Popular