Search This Blog

950. Pancha sankhyopacharini

Somnath Temple

సనాతన ధర్మంలో భగవతార్చన చేసేవారు ధూప, దీప, గంధ, పుష్ప నైవేద్యాలతో అర్చిస్తారు. 

పంచభూతాలతో నిర్మించబడిన ఈ సృష్టికి పంచేంద్రియాలకు ఉన్న సంబంధం పంచతన్మాత్ర సాయకా అనే నామంలో మనం తెలుసుకున్నాం. భగవంతునికి పుష్పములు అర్చించడం ద్వారా చర్మానికి వాయువుకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. నైవేద్యం ద్వారా నాలుకకి నీటికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. దీప దర్శనం ద్వారా కంటికి కాంతికి(అగ్ని) ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. ధూపమము, గంధము అర్పించడం ద్వారా ముక్కుకు పృథివికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. గంట, వేదమంత్రాల శబ్దం ద్వారా చెవికి ఆకాశానికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. తన్మాత్రలన్నీ శమించినపుడు మనస్సు నిశ్చలమవుతుంది. అప్పుడు సాధన బాగా సాగుతుంది. సాధారణంగా హుందువులందరూ గుడికి వెళ్లి వస్తున్నపుడు మనస్సులో ఎదో తెలియని ప్రశాంతత అనుభవిస్తుంటారు. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే. 

In sanaatana dharma, people offer, scent, flowers, delicious food items and light to God while worshipping. 

We learnt the link between the world built with the five elements and the five senses of the body in the name Pancha thanmathra saayaka. By offering tender flowers to God, the devotees pacify the thanmathra of skin and air. The sounds of conch, bell and mantras pacify the thanmathra of ears and sky. Light pacifies the thanmathra of eye and light(fire). Scent pacifies the thanmathra of nose and earth. Delicious food pacifies thanmathra of tongue and water. Generally, Hindus experience a strange calmness while returning from a temple. This is the secret behind it. When the thanmathras are pacified, the mind become still. A still mind has better focus. That will make penance easier.

Popular