Search This Blog

942-943. వ్యోమకేశీ విమానస్థా


వ్యోమ అంటే ఆకాశం. కేశ అంటే కేశములు. వ్యోమకేశ అంటే గంగను భూమికి తీసుకురావడానికి శివుడు ఎత్తిన అవతారం. ఆయన శక్తి వ్యోమకేశీ. రామాయణంలో గంగావతరణం కధలో ఈ అవతారం గురించి వివరించారు. 

కధ - తన పూర్వీకులైన సగరపుత్రులు సరైన అంత్యక్రియలు జరుగక సత్గతులు పొందలేక అవస్థలు పడుతున్నారని తెలుసుకున్న భగీరథుడు ఆవేదనచెంది తరుణోపాయం చెప్పమని మునులను ప్రాధేయపడతాడు. అప్పుడు వారు బ్రహ్మలోకంలో ఉన్న గంగను సగరపుత్రుల బూడిద కుప్పల మీదుగా ప్రవహింపజేస్తే వారి దాహం తీరుతుంది అని చెప్పి బ్రహ్మానుగ్రహం కొరకు తపస్సు చేయమని సలహా ఇస్తారు. అప్పుడు భగీరథుడు బ్రహ్మకోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి మెచ్చి బ్రహ్మ గంగను భూలోకానికి పంపడానికి అనుగ్రహిస్తాడు. అయితే ఆకాశం నుండి గంగ భూమిపై పడితే భూమి చెల్లాచెదురైపోతుందని, అందువల్ల ఆమె వేగాన్ని ఒడిసి పట్టి మెల్లగా నీటిని భూమికి చేరవేయుటకై ఈశ్వరుని వేడుకోవమని సెలవిస్తాడు. భగీరథుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం కొరకు కఠోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు గంగను ఒడిసి పట్టుకోవడానికి అంగీకరిస్తాడు. అప్పుడు శివుడు తన రెండు పాదములను దూరంగా పెట్టి మోకాళ్ళు వంచి నిలుచుంటాడు. చేతి మడమలు తిప్పి మొలపై ఉంచుకుని, తన కేశములను ఆకాశమంతా విస్తరిస్తాడు. ఇదే వ్యోమకేశుని అవతారం.  ఆకాశంలోని గంగకు రా! నా నుదిటిపై దూకు అని సైగ చేస్తాడు. అప్పుడు అమాంతం గంగ వ్యోమకేశునిపై దూకుతుంది. ఆమెకు ఆయని నిజస్వరూపం, శక్తి సామర్ధ్యాలు తెలియవు. తన వేగంతో ఆయనని పడదోయగలననే పొగరుతో ఉంటుంది. ఆమె పొగరు అణచివేయడానికి వ్యోమకేశుడు ఆకాశమునుండి దూకిన గంగను తన కేశములలో బంధించి ఉంచుతాడు. ఆయన కేశములలో ఇరుక్కుని ఒక్క నీటి బొట్టు కూడా నేలపై పడదు. అప్పుడు భగీరథుడు మళ్ళీ వ్యోమకేశుని ప్రార్ధిస్తాడు. గంగకు ఆయన శక్తి గురించి వివరించి తను చేసిన తప్పుకు క్షమాపణ కోరమంటాడు. తన తప్పు తెలుసుకుని గంగ ఆయనను క్షమించమని అర్ధిస్తుంది. అప్పుడు ఆయన తన కేశములనుండి గంగను మెల్లగా భూమిపైకి వదులుతాడు. 

కధలోని సాంకేతిక పరిజ్ఞానం - నీరే ఈ భూమిపై సమస్త జీవాల మనుగడకు ఆధారం. ఎన్నో గొప్ప గొప్ప నాగరికతలన్నీ పుణ్యనదుల ఆధారంగానే వెలిశాయి. భూమి పైభాగం 70 శాతం నీటితో నిండి ఉంది. అసలు ఇంత నీరు భూమిపైకి ఎలా వచ్చింది? దీనికి శాస్త్రవేత్తల సమాధానం ఇలా ఉంది. కోట్లకొద్దీ మంచుతో కప్పబడ్డ గ్రహ శకలాలు భూమి గృత్వాకర్షణ శక్తి పరిధిలోకి వచ్చి ఒకదానితో ఒకటి ఢీకొన్నాయిట. ఆ మంచు కరిగి భూమిపై నీరుగా వచ్చిందిట. అయితే ఈ ప్రక్రియ జరగడానికి చాలా ఏళ్ళు పట్టిందిట. గ్రహ శకలాలనుండి వచ్చిన నీరు ఆవిరై భూమి ఉపరితలమునందే ఉండిపోయిందిట. అలా ఎన్నో సంవత్యరాలు గడిచిన తరువాత మబ్బులు తయారయ్యి వర్షం కురిసిందిట. అప్పుడు ఆ నీరు నేల చేరిందిట. నిజానికి ఆలా వర్షించే చినుకు భూమి గురుత్వాకర్షణ వల్ల బుల్లెట్ కన్నా వేగంగా వచ్చి భూమిలో చొచ్చుకు పోతుందిట. ఆ వేగానికి జీవాలన్నీ చనిపోతాయిట. కానీ ఆలా జరగలేదు. ఎందుకంటే మబ్బుని వీడిన చినుకు క్రిందకు పయనిస్తున్నపుడు గాలితో ఘర్షణ పొందుతుందిట. ఆ ఘర్షణలో తన గతిని కోల్పోతూ ఉంటుందిట. ఈ ఘర్షణ చినుకు వేగాన్ని 9.2 మీ/సెకండ్ కన్నా ఎక్కువ అవ్వకుండా చూస్తుందిట. 

రహస్యం - ఆకాశం నిండా గాలి ఉంటుంది. వాన చినుకు ఆ గాలితో ఘర్షణ పొందుతూ మెల్లగా భూమి చేరుతుంది. వ్యోమకేశుని కేశములనుండి గంగ మెల్లగా పారినట్లు. వ్యోమ అంటే ఆకాశం. ఆకాశము నిండా తన కేశములు విస్తరించాడు కనుక ఆయన వ్యోమకేశుడు అని పిలవబడ్డాడు. రహస్యం ఏమిటంటే కేశములే గాలి. వ్యోమకేశుడు కేవలం మనం ఆరాధించే శివుని అవతారం కాదు. భూమిపై నీరు రావడానికి జరిగిన ఒక గొప్ప సాంకేతిక ప్రక్రియకి నిదర్శనం. రామాయణం కేవలం హిందువులు చదువుకునే ఆధ్యాత్మిక గ్రంథం కాదు. ఇటువంటి అద్భుత గాధల సమాహారం. వ్యోమకేశుని గురించినది కాకపోయినా ఇక్కడ సందర్భం వచ్చింది కనుక ఇలాంటి విషయం ఇంకొకటి కూడా ప్రస్తావించుకుందాం. మానవ శరీరంలోని ఎండోక్రైన్ సిస్టం గురించి రామాయణంలో విస్తారంగా వివరించారట. ఈ విషయం ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. టోనీ నాడర్ గారు ఈ క్రింది వీడియోలో వివరించారు. 


తత్త్వం - విమానం అంటే పైన ఉండేది. విమానస్థా అంటే పైభాగంలో ఉండేది. అమ్మ సహస్రార చక్రంలో ఉంటుంది. అది శిరస్సులో ఉంటుంది. శిరస్సు శరీరానికి పైభాగంలో ఉంటుంది. అందుకే విమానస్థా అన్నారు. 

పైన కనిపించే ఆకాశం అంతులేనిది. పరమాత్మ ఆ ఆకాశమంతా నిండి నిభిడీకృతమైనాడు. అక్కడనుండి మనలను రక్షిస్తున్నాడు(వ్యోమకేశుని లాగ).  అందుకే విమానస్థా అన్నారు. 

Popular