సూక్ష్మదేహము అంటే పంచప్రాణాలు, దశేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము. వెరసి 19. ఇది కంటికి కనిపించనిది. కాని దీని విశేషం జ్ఞానులకు తెలుస్తుంది. జ్ఞాన చక్షువులకు కనిపిస్తుంది. స్థూలదేహాన్ని ఆయా పనులు చేసేటట్లుగా చూసేది ఈ సూక్ష్మదేహమే. స్థూలదేహంలో ఉన్న ఇంద్రియాలలో ప్రవేశించి ఆ అనుభూతులు పొందుతూ ఉంటుంది. ఈ రకంగా స్థూలదేహం పనులు చేస్తుంది. వాటి యొక్క అనుభూతులు పొందేది సూక్ష్మదేహము. సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, లోభము, మోహము, శోకము, చింత, అలసత్వము, ఇవన్నీ సూక్ష్మదేహం యొక్క ధర్మాలు. ఈ సూక్ష్మ దేహానికి ప్రకృతి కారణము. ఆ ప్రకృతికి ఇది కార్యము అవుతుంది. సూక్ష్మదేహం కారణదేహంలో లీనమై ఉంటుంది. అందుచేత సూక్ష్మదేహానికి ఉన్న ధర్మాలన్నీ కారణదేహం నుంచి కలిగినవే. కారణదేహంలో ఉన్నటువంటి కృత్యాలన్నీ సూక్ష్మదేహానికి వచ్చి అక్కడ నుంచి స్థూలదేహంతో కార్యాలు చేయిస్తాయి. ఈ రకమైన కార్యకారణాలు ఏవీ లేనిది.
కార్యా కారణ నిర్ముక్తా అంటే కార్యములు, కారణములచే విడివడినది. కార్యములు - భూ, భువః, మహః, జనః మొదలగు లోకాలు. కారణములు - మూలప్రకృతి. ఈ కార్యకారణాలు లేనిది. వాస్తవంగా చైతన్యంలో అవి లేవు. అమ్మ కార్యరూపమయినటువంటి మహదాది తత్త్వాలతో సూచించబడే నామరూపాత్మకమైన జగత్తును, దానికి కారణమైనటువంటి అవ్యాకృతాన్ని వదిలినటువంటి కేవల నిర్వికార చైతన్య స్వరూపిణి. కాబట్టి 'కార్యకారణ నిర్ముక్తా' అనబడుతోంది. ఆమెకు కారణాలుగాని, కార్యాలుగాని ఏ మాత్రం లేవు.The subtle body means the 5 pranas, 10 senses and 4 antah karanas. It is not perceivable. It can only be known through the eyes of wisdom. The physical body is the effect of the subtle body. So the later becomes the cause of the former. It causes various elements of the physical body there by performing various activities. It is the one that experiences things like pain, pleasure, passion, hatred, happy, sorrow etc. Subtle body is the effect of Prakruthi. Hence Prakruthi is called Causal body. The subtle body is embedded into the causal body. Hence all the experiences of the subtle body are caused by the causal body. These experiences in turn cause activities in the physical body. Divine mother is devoid of these cause and effects
Kaaryaas are lokas like Bhu, bhuvah, mahah, janah etc. Moola prakruthi is the cause of these. Actually, pure consciousness is devoid of these lokas and the moola prakruthi. Mother made them out of it to help us perceive things and understand Her.