శరీరంలో ప్రాణము ఐదు రూపాలుగా ఉంటుంది.
1. ప్రాణ, 2. అపాన, 3. వ్యాన, 4. ఉదాన, 5. సమాన వాయువులు
ఈ ఐదింటికీ ముఖ్య ప్రాణస్వరూపిణి మన అమ్మ.
Divine Mother is the chief of all the vital life forces. She gives life to all the senses, Mind and the body. In Vedas it is said that Paramaatma is the vital life force of all the 5 vital life forces like: 1.Praana, 2.Apaana, 3.Vyaana, 4.Udaana and 5.Samaana
1. Prana - Also called Prana Vayu
ప్రాణ వాయువు శక్తిని బ్రహ్మాండమునుండి పిండాండములోనికి తీసుకు రావడానికి పని చేస్తుంది. అది లోపలికి క్రిందకి కదులుతుంది. ఇది శిరములో ఊపిరి తిత్తులలో హృదయములో ఉంటుంది.
2. Apaana - Also called Apaana Vayu
అపాన వాయువు వ్యర్థ పదార్ధములను పిండాండమునుండి ప్రకృతిలోకి విసర్జించటానికి పనిచేస్తుంది. ఇది కటి ప్రదేశములో ఉంటుంది. అన్నసారం శరీరం లోకి ఇంకడానికి ఇది ఉపయోగ పడుతుంది.
3. Samaana - Also called Samaana Vaayu
సమాన వాయువు శరీరానికి సమతుల్యాన్ని అందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగటం, నడవటం, ఆలోచనలలో సమతుల్యత మొదలైనవాటికోసం ఈ వాయువు పని చేస్తుంది. ఇది నాభి ప్రదేశంలో ఉంటుంది.
4. Vyaana - Also called Vyaana Vaayu
వ్యాన వాయువు ప్రసరణ వ్యవహారాల కోసం పనిచేస్తుంది. ఆహార పోషకాలను శరీరానికి అందిస్తుంది. వాయు ప్రసరణ జరుపుతుంది. ఇది హృదయంలోనూ ఊపిరి తిత్తులలోనూ సెంట్రల్ నెర్వస్ సిస్టం లోనూ ఉంటుంది.