Search This Blog

815. Nithyathriptha

నిత్యము తృప్తి చెందేది. కేవలం భక్తి మాత్రంచేతనే ప్రీతి చెందేది. తృప్తి అనేది ఆనందం యొక్క లక్షణం. అమ్మ ఆనందమే స్వరూపముగా గలది. కాబట్టి నిత్యతృప్తా అనబడుతోంది. పరమేశ్వరిని అర్చించటానికి అనేక పూజా విధానాలున్నాయి. చతుషష్ట్యుపచారాలు, షోడశోపచారాలు ఈ రకంగా అనేకమున్నాయి. కాని

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి | త దహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః || భక్తితో సమర్పించే నీటి బొట్టుతోనైనా సరే నేను సంతసిస్తాను అంటోంది ఆవిడ. పైన చెప్పిన ఉపచారాలన్నీ సంప్రదాయసిద్ధము. కార్యసాధనకు అనుకూలము. వాటివల్ల పనులు జరుగుతాయి. కాని భగవత్సాక్షాత్కారం కావాలి అంటే భక్తి ప్రధానమైనది. మీరు పూజలో ఏమి ఇచ్చారు అనేది ఆవిడకు ఎన్నడూ అవసరం లేదు. ఆవిడకు కావలిసింది మీ భక్తి. తనను తానూ మరిచి భగవంతునితో మమేకమైపోవడమే ఆత్మ సాక్షాత్కారమంటే. అదే నిజమైన భక్తుని లక్షణం.

క్షరములైన శరీరము, బుద్ధి మొదలగునవి ఉపయోగించి, అక్షరమైన పరబ్రహ్మమును చేరుకోవడమే మోక్షము.

Divine mother is always fully satisfied. Satisfaction is a mark of happiness. She is the personification of ultimate happiness. Hence, she is always satisfied. Vedas prescribed many ways of worship. You can worship with a set of 64 services (upacharas) or 16 services (upacharas). You can offer flowers, food, incent sticks etc. However, you have to note that these are for yourself. To satisfy your wants/wishes in a dharmic way. Mother don't need them.

Patram pushpam Phalam toyam Yome bhaktyaa prayachchathi |
Tath aham bhaktyupahrutam ashnaami prayataatmanah ||

What gives utmost satisfaction to mother is devotion. You may offer a small drop of water if nothing else is available. It is still fine. She never bothers about what you offer. She does not need them. Ever. What matters is your devotion towards her. Devotion means to forget about self completely and unite with the mother. That's the path to Moksha.

To use the perishable body and intellect to reach the imperishable paramaatma is the real journey of Moksha (Liberation).

Popular