Search This Blog

781. Vishwatomukhee


అన్నివైపులకు ముఖము గలది. అన్ని దిక్కులకు ముఖము గలది. 'ఆ పరమేశ్వరుడికి అన్నివైపులా కళ్ళు ముఖాలు ఉన్నాయి' అని వేదం చెబుతోంది. ఎక్కడైతే అమ్మని ధ్యానించాలని అనుకుంటారో అక్కడ ఆమె ప్రతిష్టింపబడుతుంది. అక్కడ ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఆమె అన్ని ప్రదేశాలలోనూ ఉన్నది. విశ్వతోముఖీ అనబడుతున్నది.

వేదంలో

సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్ పరమేశ్వరుడికి అనేకవేల శిరస్సులు, కనులు, ముఖాలు, చేతులు ఉన్నాయి. అంటే సృష్టిలోని జీవరాశి అంతా పరమేశ్వర స్వరూపమే. జగత్తంతా పరమేశ్వరమయమే. అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వాంతర్యామి అని వేదం చెబుతోంది. కాబట్టి పరమేశ్వర స్వరూపమైన ఆ అమ్మ విశ్వతోముఖీ అనబడుతున్నది.

భగవన్ - అన్ని భాగాలలోనూ ఉండే వాడు భగవంతుడు. దేనినైనా ఎంత చిన్న భాగం చేసినా సరే ఆ చిన్న భాగంలో కూడా ఉండే వాడే భగవంతుడు.

Divine mother is omni present. She witnesses everything. She is in every being. She emerges from where ever you worship her.

It is said like this in Vedas
Sahasra seershah purushah sahasrakshi sahasra paath
Paramaatma has infinite heads, eyes and feet. That means it is present in every living thing. It is seeing from everywhere, it is present everywhere.

Bhagavan - Bhaaga means part. Bhagavan means one who is present in all parts. Take the tiniest part of anything. Paramatma is present in it.

Popular