మోక్షమే రూపంగా గలది. అమ్మ రూపము జ్ఞానము. పరబ్రహ్మసాక్షాత్కారం జరిగింది లేక ఆత్మ సాక్షాత్కారమయింది. అంటే అర్ధం - జ్ఞానం కలిగింది. భేద భావం నశించింది. అజ్ఞానం పటాపంచలయింది అంటే జ్ఞానోదయమైంది అన్నమాట. స్వస్వరూప జ్ఞానం కలిగింది అంటే ముక్తి కలిగింది అన్నమాట. ఇంద్రియాలను మనస్సులోను. మనస్సును, బుద్ధిలోను బుద్ధిని - ముఖ్యప్రాణంలో లయం చెయ్యటమే ముక్తి. ఇదే తురీయ స్థితి. అమ్మ ఎప్పుడూ ఈ స్థితిలోనే ఉంటుంది. అందుచేతనే ముక్తిరూపిణీ అనబడుతోంది.
Mukthi means Liberation. Divine mother is the embodiment of consciousness. If one realizes self, that indicates the rise of consciousness, the triumph over duality. Self realization means Mukthi - liberation. Fold senses into the mind, mind into intellect, intellect into prana. Then one enters the state of trance. Divine mother is always in this state.