ప్రేమ స్నేహో భక్తి రేవ రూపం యస్యాః - సా
ప్రేమ అంటే - స్నేహము, భక్తి అని అర్ధం. ఇవి రూపంగా గలది. ఈ జగత్తంతా పరమేశ్వరుడిది. తాను నిర్మించిన జగత్తు మీద తనకు ప్రేమ ఉంటుంది కదా. అలాగే అమ్మకు సకలజీవరాశి యందు సమానమైన ప్రేమ ఉంటుంది. క్రిమికీటకాల దగ్గరనుంచీ ఆ పరమేశ్వరి సృష్టితాలే. అందుచేత ఆమె దృష్టిలో అన్ని జీవులూ ఒకటే. అన్నిటియందు సమానమైన ప్రేమ, వాత్సల్యము ఉంటాయి. తల్లి గనుక వారేది కోరితే అది ఇచ్చేస్తుంది. అమ్మ ప్రేమయే ఆనందరూపం (ఆనంద కలికా నామం చదవండి).Prema sneho bhakti reva roopam yasyaah saa
Prema means Love, inclination, friendhsip etc. These are the forms in which para brahma expresses itself. This is his creation. So he loves all of it. Divine mother is para brahma. so she loves every living being in this creation. She spreads her love equally to all of them. She does not differentiate between a small insect or a mighty elephant. This love is ananda (refer Ananda kalikaa)