Search This Blog

726. Dakshinamurthy roopini

 దక్షిణామూర్తి రూపం గలది.

శుద్ధస్పటికసంకాశం శశిఖండవిభూషితం
వ్యాఘ్ర చర్మధరం శాంతం జటామకుటమండితం
ముఖపంకేరుహోల్లాసం సోమసూర్యాగ్నిలోచనం
భావయామి మహాదేవం దక్షిణామూర్తి విగ్రహం ||


దక్షిణముఖంగా కూర్చుని, త్రిమూర్తులకు గురువుగా ప్రసిద్ధి చెందినవాడు. ఒకసారి బ్రహ్మ విషయంలో అనుమానం వచ్చి సనక సనందనాదులు పరమేశ్వరుణ్ణి ప్రార్ధించారు. అప్పుడు ఆయన పదహారు సంవత్సరాల వయస్సుతో భాండీరము అనే వటవృక్షం క్రింద దక్షిణాభిముఖంగా పద్మాసనంలో, చిన్మయముద్రతో, తురీయ స్థితిలో దర్శనమిచ్చాడు. అతన్ని చూడగానే వారి సంశయాలన్నీ తొలగిపోయాయి. అతడే దక్షిణామూర్తి. సర్వవిద్యలకు నది. సర్వవిద్యా ప్రపంచానికి గురువు. కేవలము సరస్వతీదేవి రూపము.

దక్షిణామూర్తి అనే పేరులో దక్షిణ అంటే - సృష్టి స్థితి లయ కారుకుడైన సగుణ బ్రహ్మ. మూర్తి అంటే - నిర్గుణ బ్రహ్మ. పరమేశ్వరి సగుణ, నిర్గుణ బ్రహ్మ స్వరూపిణి. కాబట్టే ఆమె దక్షిణామూర్తి రూపిణీ అనబడింది.

మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం
వర్షిస్తానంటే వాసదృషిగానైహ్ ఆవృత్తం బ్రహ్మనిష్ఠఇహి
ఆచారియెన్ద్రం కారకలిత చిన్ముద్రమానంద మూర్తిం
స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే

వట వృక్షం క్రింద మౌనంగా కూర్చునివున్న శ్రీ దక్షిణామూర్తికి నమస్కారములు. ఆయన యువకుడు. అయినా చుట్టూ వయోవృద్ధులైన మునులు ఋషులు ఉన్నారు. ఆయన చిన్ముద్ర పట్టి ఆత్మానందంలో రమించిపోతున్నారు. ఆ దక్షుణామూర్తియే మనందరికీ గురువు.

వాతవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
సకల ముని జనానాం జ్ఞాన దాతారామారాత్
త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం
జనన మరణ దుఖఃచ్ఛేద దక్షం నమామి

ఆయన మూడు లోకాలకు గురువు. వటవృక్షం క్రింద కూర్చుని మునులందరికి జ్ఞానం పంచుతున్నారు. వారికి జననమరణాలనే దుఃఖాన్ని తొలగిస్తున్నారు.

చిత్రం వట తరూర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానాం శిష్యస్తూ చిన్న శంశాయహ్

చిత్రం ఏమిటంటే గురువేమో 16 ఏళ్ల యువకుడు. శిష్యులేమో తల నెరిసిన వృద్ధులు. గురువు మౌనంగా చెట్టు క్రింద కూర్చున్నాడు. శిష్యుల సందేహాలన్నీ తీరిపోతున్నాయి

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగినాం
గురవే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమః

సర్వ విద్యలకు ఈయనే ఆలవాలము. ఈ భావ రోగానికి ఈయనే మందు. అందరికీ గురువు శ్రీ దక్షిణామూర్తి. ఆయనకి నా నమస్కారములు.

ఓం నమః ప్రాణవార్ధాయ శుధ్ధహ్ ఙ్ఞానైక మూర్తియే
నిర్మలాయహ్ ప్రశాన్తాయహ్ దక్షిణామూర్తయే నమః

ప్రణవమైన ఓంకారానికి ఈయనే అర్ధం. మూర్తీభవించిన జ్ఞాన స్వరూపం. ఆయన నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నారు. ఆయనకు నా నమస్కారములు

చిద్ఘనాయ మహేశాయ వట మూల నివాసినే
సాచ్చ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః

ఘనీభవించిన జ్ఞాన స్వరూపం. సాక్షాత్తు మహేశ్వరుడు ఈ మర్రి చెట్టు క్రింద వెలిశాడు. ఈ దక్షిణామూర్తి సచ్చిదానంద స్వరూపుడు. ఆయనకు నా నమస్సుమాంజలులు.

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే
వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తియేనమః

ఈశ్వరుడు, గురువు, ఆత్మ. ఇవన్నీ పరబ్రహ్మ యొక్క రూపాలు. వీటన్నింటిలోనూ ఆవహించి చిదాకాశంలా ఉన్నాడు దక్షిణామూర్తి. ఆయనకు నమస్కారములు.

Divine mother takes the form of Dakshina Murthy.

Shuddha spatikasankaasham shashikhandavibhooshitam
vyaaghra charmadharam shantam jataamakutamanditam
mukhapankeruhollasam somasooryaagnilochanam
bhaavayaami mahadevam dakshinamurthy vigraham ||

Dakshina murthy is sitting in padmasana with head facing south. He is known as the guru of the Trimurthys. Once upon a time, great saints like Sanaka, Sananda etc were not clear about Brahma. They prayed Parameshwara to resolve their doubts. Then Lord Parameshwara came as 16 year old bachelor and sat before them under the Bhandira tree. All their doubts got resolved at the mere sight of Sri Dakshina murthy. He is the essence of all the knowledge and wisdom. The guru of all students. Pure form of Goddess Saraswathi.

Dakshina means creation, sustenance and destruction. Murthy means attribute less para brahma. Divine mother is brahma with and without attributes. So she is called Dakshina Murthy.

Mauna-Vyaakhyaa Prakattita Para-Brahma-Tattvam Yuvaanam
Varssisstthaam-Te Vasad Rssigannaih Aavrtam Brahma-Nisstthaih |
Aacaarye[a-I]ndram Kara-Kalita Cin-Mudram-Aananda-Muurtim
Sva-[A]atmaaraamam Mudita-Vadanam Dakssinnaamuurti-Miidde 

Salutations to great Dhakishna murthy who has shattered all our doubts and confusion without even uttering a single word. He is just 16 year old and is surrounded by great saints. He is sitting under the vata tree holding chin mudra and rejoicing the bliss of Atman.

Vatta-Vittapi-Samiipe-Bhuumi-Bhaage Nissannnnam
Sakala-Muni-Janaanaam Jnyaana-Daataaram-Aaraat |
Tri-Bhuvana-Gurum-Iisham Dakssinnaamuurti-Devam
Janana-Maranna-Duhkhac-Cheda Dakssam Namaami ||2||

Salutations to him who is sitting under the banyana(vata) tree and spreading the Divine knowledge and wisdom to all the great saints. He is Lord parameswara himself who is the master of all the worlds and the one who can releive us from the sorrows of cycles of birth and death

Citram Vatta-Taror-Muule Vrddhaah Shissyaa Gurur-Yuvaa |
Guros-Tu Maunam Vyaakhyaanam Shissyaas-Tuc-Chinna-Samshayaah ||3||

It is indeed a strange picture to behold; At the root (i.e. base) of a Banyan Tree (Vata) are seated old Disciples (i.e. aged Disciples) in front of an Young Guru, The Guru is Silent, and Silence is His exposition (of the Highest Knowledge); and that (Silence) is severing the doubts (automatically) from the minds of the Disciples.

Nidhaye Sarva-Vidyaanaam Bhissaje Bhava-Roginnaam |
Gurave Sarva-Lokaanaam Dakssinnaamuurtaye Namah ||4||

(Salutations to Sri Dakshinamurthy) Who is a receptacle to all Knowledge, Who is a Medicine to all the diseases of Worldly bondage, Who is a Guru to all the Worlds; Salutations to Sri Dakshinamurthy.

Om Namah Prannava-Arthaaya Shuddha-Jnyaanai[a-E]ka-Muurtaye |
Nirmalaaya Prashaantaaya Dakssinnaamuurtaye Namah ||5||

Salutations to the embodiment of Pranava (Om), Salutations to the personification of the Pure, Non-Dual(adwaita) Knowledge, Pure and Stainless, peaceful and calm Sri Dakshinamurthy.

Cid-Ghanaaya Mahe[aa-Ii]shaaya Vatta-Muula-Nivaasine |
Sac-Cid-Aananda-Ruupaaya Dakssinnaamuurtaye Namah ||6||

Salutations to the one Who is (as if) Consciousness Solidified, Mahesha (the Great God),the One Who dwell at the root (i.e. base) of the Banyan Tree (Vata), the embodiment of Sacchidananda (Existence, Consciousness, Bliss); Salutations to Sri Dakshinamurthy.

Iishvaro Gurur-Aatme[a-I]ti Muurti-Bheda-Vibhaagine |
Vyoma-Vad Vyaapta-Dehaaya Dakssinnaamuurtaye Namah ||7||

Salutations to that Dakshinamurthy who is "Ishwara - Guru - Atman"; Who is the all pervading sky (Underlying) these different forms

Popular