Search This Blog

722. Komalaangi

కోమలమైన అంగములు గలది. పరమేశ్వరి యొక్క స్థూలశరీరాన్ని వర్ణించేటప్పుడు ఆమె అంగాలు అన్నీ అతి సుకుమారంగా ఉన్నాయి అని చెప్పటం జరిగింది. అమ్మ వేదస్వరూపిణి. వేదానికి ఆరు అంగాలున్నాయి అవి.
1. శిక్ష 2 వ్యాకరణము 3. ఛందస్సు 4. నిరుక్తము 5.. జ్యోతిషము 6. కల్పము. వీటినే షడంగాలు అంటారు. ఈ షండంగాలు కలది. కాబట్టి కోమలాంగి అనబడుతోంది.

అమ్మ వేదాలనే అంగాలుగా కలిగి ఉన్నది.
యజుర్వేదము - శిరస్సు, ఋగ్వేదము - దక్షిణపక్షము, సామవేదము - ఉత్తరపక్షము, అధర్వణవేదము - పుచ్ఛము
బ్రాహ్మణాలు - ఇతర అవయవాలు. ఈ రకంగా అంగాలు కలిగి ఉన్నది. కాబట్టి కోమలాంగీ.

దేవి శరీరంలో
1. హృదయదేవి 2. శిరోదేవి 3. శిఖాదేవి 4. కవచదేవి 5. నేత్రదేవి 6. అస్త్రదేవి
ఈ ఆరుగురు అంగాలుగా ఉన్నారు కాబట్టి కోమలాంగి అనబడుతున్నది.

Komala means tender/soft. While describing Divine Mother, she is described as having tender/soft body. Apart from this, various branches of Vedas like 1.Siksha 2.Vyaakarana 3.Chandassu 4.Niruktamu, 5.Jyotishamu 6.Kalpamu are also regarded as limbs of mother

Rig Yajur Sama Atharvana vedas are said as Divine Mother's body parts. Yajur veda is her head. Rig ved is her souther part. Sama veda is her northern part. Atharvana veda is her skull. Brahmanas are the other body parts.

1.Hrudaya devi 2.Shirodevi 3.Shikhadevi 4.Kavachadevi 5.Netradevi 6.Astradevi. These are the sections of Divine Mothers body.

Popular