రాజసూయము చేసినవాడు, మహామండలేశ్వరుడు, రాజాధిరాజు. వీరిని సామ్రాట్టులు అంటారు. వారు పాలించేది సామ్రాజ్యము. అటువంటి సామ్రాజ్యాన్ని ఇచ్చేది అమ్మ.
రాజులు పాలించేవి రాజ్యాలు. అటువంటి కొన్ని రాజ్యాలు కలిస్తే సామ్రాజ్యము. పూర్వకాలంలో భారత దేశం కూడా అఖండభారతంగా ఉండేది. పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేష్, శ్రీలంక ఇవన్నీ భారత దేశం లోని ప్రాంతాలే. ఈ అఖండవైదిక సామ్రాజ్యాన్ని ఎందరో గొప్ప సామ్రాట్టులు పాలించి ఇక్కడ సనాతన ధర్మాన్ని స్థాపించారు. సనాతన ధర్మం అంటే అనాదిగా వస్తున్న ఆచారం. మనుషులు ఆచరించ వలసిన సూత్రాలు. కొంత కాలం తరువాత పర్షియా నుంచి సింధు నది దాటి వచ్చిన వారు ఈ అఖండ సామ్రాజ్యాన్ని హిందూస్తాన్ అని పిలిచారు. ఇక్కడి వారిని హిందువులు అని అన్నారు.రాజసూయము అనేది - ఒక యాగము ఇది రాజులు తమ పరాక్రమాన్ని నిరూపించుకోవటానికి మాత్రమే చేస్తారు. యాగం చేసేవారు తమ ఆధిపత్యాన్ని అంగీకరించవలసినదిగా ఇతర రాజులకు వర్తమానం పంపుతారు. దానిని అంగీకరించని వారితో యుద్ధం చేసి గెలుస్తారు. ఈ విధంగా రాజులందరినీ గెలిచి, యాగపరిసమాప్తిగా పూర్ణాహుతి చేసి అవబృధస్నానం చేస్తారు. ఈ రకంగా చేసినవారు ఉత్తమోత్తములు. వారి జన్మలు పరమపావనము. అటువంటి ఆఖండ సామ్రాజ్యాన్ని ప్రసాదించేది, అమ్మ లలితమ్మ.
బ్రహ్మ విద్యయే ఆత్మవిద్య. ఆత్మవిద్యనుపాసించినవారు ఆత్మసామ్రాజ్యానికి అధిపతులు. అటువంటి ఆత్మసామ్రాజ్యాన్ని ప్రసాదించేది అమ్మే.
An emperor is the one who rules multiple kingdoms. They are called Samrat. The region they rule is called Samrajyam. Divine mother gives such Samrajyams to those who worship her.
A few centuries ago, there used to be a big region called Bharata khanda. It is union of countries like India, Pakistan, Bangladesh, Sri Lanka, Burma etc. It is famously called akhanda Bharat (undivided Bharat). Many emperors ruled akhanda Bharat and established vedic religion. It used to be called as Sanatana Dharma. Sanata Dharma means a set of guidelines that are prescribed and followed for a very long time. Some time later people from Persia crossed river Sindhu and learnt about this great region and culture. They called it Hindustan and Hinduism.
Rajasuya is a yaga. It is performed by kings to spread their kingdom. A king who performs Rajasuya should send a message to all other kings to accept his superiority and command. He has to defeat those who oppose his command. After winning over all others, the king who is performing the yaga should do avabrudha snana (Sacred bath). Then the yaga is complete. He becomes a Samrat or an emperor. Kings who complete Rajasuya would attain Moksha. Divine mother is the giver of such Samrajya
Brahma vidya or Atma vidya is the knowledge of Brahman. One who practices it becomes emperors of the Atma Samrajya. Divine mother is the giver of such Atma Samrajya.