Search This Blog

641. Waagadheeswari

వాచాం అధీశ్వరీ వాక్కులకు అధీశ్వరి. వాక్కుకు మూలమైన పరాశక్తి. వాక్కు నాలుగురూపాలుగా ఉంటుంది. అని గతంలో వివరించాం. అవి పరా పశ్యంతీ మధ్యమా వైఖరి. వీటిలో మొట్టమొదటిది పరావాక్కు. ఆఖరుది వైఖరీవాక్కు వైఖరీవాక్కులో మిగిలిన మూడు అంటే పరా, పశ్యంతీ, మధ్యములు కలిసిపోయి ఉంటాయి. మూడూ దాదాపుగా అవ్యక్తములు. కంటికి కనిపించవు. నాల్గవదైన వైఖరీవాక్కు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. అయితే వాక్కుకు ప్రారంభదశ పరావాక్కు. ఇది పరాస్థానంలో అంటే సహస్రారంలో ఉద్భవిస్తుంది. సైన్సు ప్రకారము కూడా ముందుగా ఆలోచన వచ్చేది మెదడులోనే. ఆ మెదడు సహస్రారంలో ఉన్నది. అదే పరాస్థానము. పరావాక్కు పరదేవతా స్వరూపము.

అందుచేతనే పరమేశ్వరి వాగధీశ్వరీ అనబడుతున్నది. భారతి, వాణి, సరస్వతి మొదలైన పేర్లతో చెప్పబడే దేవత ఈమె. వశిన్యాది దేవతలుగా చెప్పబడేది కూడా ఈమె.

  1. వశిని
  2. మోదిని
  3. అరుణ
  4. విమల
  5. జయ
  6. సర్వేశ్వరి
  7. కామేశ్వరి
  8. కౌళిని
వీరందరూ వాగ్గేవతలు. సరస్వతీదేవి స్వరూపాలు. వీరందరికీ అధీశ్వరి కాబట్టి వాగధీశ్వరీ అనబడుతుంది.

'Waak' means speech. It is explained in previous names that speech has four stages. 'Para' is the first one. This happens in the mind. These thoughts then pass through the stages called Pasyanthi', 'Madhyama' and finally reach the Larynx where it forms the final speech. This is called 'Vaikhari'. 'Para' which is the origin of speech is form of Divine Mother. Hence she is called Waakgadheeswari.

Below are called Waak devatas
  1. Vashini
  2. Modini
  3. Aruna
  4. Vimala
  5. Jaya
  6. Sarweshwari
  7. Kaameshwari
  8. Koulini
Divine mother is the Lord of all these Waak devatas. Hence she is called Waagadheeswari

Popular