పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతి.
దక్షయజ్ఞం సమయంలో దాక్షాయణి దగ్ధమైపోయింది. సతి వియోగాన్ని భరించలేని శివుడు కొంతకాలం దేశాల వెంబడి తిరిగి ఆ తరువాత విరాగియై హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. వజ్రాంగుడి కుమారుడు తారకాసురుడు బ్రహ్మను మెప్పించి ఇప్పటివరకు తన సృష్టిలో ఉన్న ఏ ప్రాణితోనూ మరణం లేకుండా వరం పొందాడు. వరబలంతో గర్వించి దేవతలను బాధించటం ప్రారంభించాడు. దేవతలంతా హిమాలయాలకుపోయి ఆ పరమేశ్వరిని ప్రార్థించారు. ఈ లోకంలో తన అంశపుడుతుందని, దాన్ని శివునకిచ్చి వివాహంచేస్తే, వారికి కలిగే కుమారుడు తారకుణ్ణి సంహరిస్తాడు అని చెప్పింది. అప్పుడు హిమవంతుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధించి తన యింట, తన కుమార్తెగా పుట్టమన్నాడు. అతని కోరిక మన్నించి హిమవంతుని ఇంట పుట్టి హైమవతిగా ప్రసిద్ధిచెందింది. ప్రసిద్ధి చెందిన పర్వతాలు ఏడు. అవి
- హిమవత్పర్వతము
- నిషధము
- వింధ్యపర్వతము
- మాల్యవంతము
- పారియాత్రము
- గంధమాదనము
- హేమకూటము
వీటిలో హిమవత్పర్వతము శ్రేష్టమైనది. అందుకే దాన్ని శైలేంద్రము అంటారు. ఆ పరమేశ్వరి హిమవంతుని గర్భానపుట్టింది కాబట్టి శైలేంద్రతనయా అనబడుతుంది.
- Himalayas
- Nishadas
- Vindhyas
- Malyavanta
- Paariyatra
- Gandhamaadhana
- Hema Koota