తిథులు నిత్యాస్వరూపాలు. అర్చనా విధానంలో ఆ రోజు ఉన్న తిథి ఆధారంగా, ఆ రోజున ఉండే నిత్యాదేవతను అర్చించాలి. పాడ్యమినాటి నిత్యాదేవత కామేశ్వరి. విదియనాడు భగమాలిని. ఈ రకంగా రోజూ తిథుల మాదిరిగానే నిత్యాదేవతలు కూడా మారుతుంటారు. ఇలాగే ప్రతిరోజూ ఒక్కొక్క నిత్యను పదిహేను తిథులయందు అర్చిస్తూ, పదహారవ నిత్య అయిన మహాత్రిపురసుందరిని ప్రతిరోజూ అర్చించాలి. ఇది తిథిమండల పూజ. నిత్యాదేవతలు అమ్మ స్వరూపాలే. అందుచేతనే నిత్యాదేవతల స్థితిని బట్టి అర్చించబడుతుంది.
In sanaatana dharma, days are counted as Thithis. A month has two halfs(paksha). Each half has 15 thithis. The thithi at a particular time is defined by the status of the moon.
In the process of thithi mandala pooja, each thithi is assigned to a Nitya. So we have 15 Nityas. Like the Nithya of Padyami(1st thithi) is Kameswari. Nitya of Vidiya(2nd thithi) is Bhagamaalini etc. The lustre of each Nitya is same as that of moon on that particular thithi. The 16th Nitya is our Divine mother. Her luster is Nithyakala. She is the culmination of all the 15 Nityas. So in thithi mandala pooja, one has to worship the Nitya of the thithi at that time and Divine mother. Each Nitya will be worshipped once and Divine mother will be worshipped on all the 15 days of a paksha.