Search This Blog

522. Agna chakrabja nilaya

భ్రూమధ్యభాగంలో రెండు దళాలు కలిగి ఉన్న స్థానాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. అన్ని ఇంద్రియాలకు ఇక్కడి నుంచే ఆజ్ఞలు జారీచేయబడతాయి. కాబట్టి దీన్ని ఆజ్ఞాచక్రము అంటారు. ఇది ఆత్మస్థానము.

ఈ చక్రానికి అధిదేవత సదాశివుడు. ఈ చక్రంలో సిద్ధమాతా అనే దేవత ఉంటుంది. ఆమెకు ఆరుముఖాలుంటాయి. ఈ పద్మము యొక్క రెండు దళాలలోనూ హకార క్షకారా లుంటాయి.

  1. ఇది గంగ యమున సరస్వతిల సంగమస్థానము.
  2. ఇడ పింగళ సుషుమ్నల సంగమస్థానము.
  3. కూటత్రయము, మండలత్రయము, ఖండత్రయముల సమాప్తి స్థానము.
  4. కూటత్రయము - వాగ్భవకూటమి, కామరాజకూటమి, శక్తికూటమి
  5. ఖండత్రయము - చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము
  6. మండలత్రయము - చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము
  7. ఇది త్రిపురానివాసస్థానము.
Agna chakra is present in between the two eyebrows. All sense organs receive orders from this chakra. Agna means order. Hence this is called Agna chakra.

The Adhi devata of this chakra is Sadasiva. Goddess Siddhi mata lives here. She has 6 faces. This lotus has two petals. They represent the syllables 'Ha' and 'Ksha'.

  1. This is the union of 'Ganga', 'Yamuna' and 'Saraswati'.
  2. This is the union of 'Ida', 'Pingala' and 'Shushumna'.
  3. This is the end of 'Kootatraya', 'Mandalatraya' and 'Khandatraya'
  4. 'Kootatraya' - 1. Vaagbhava kootami, 2. Kaamaraja kootami, 3.Shakti kootami
  5. 'Khandatraya' - 1. Chandra khanda, 2. Surya khanda, 3. Agni khanda
  6. 'Mandalatraya' - 1. Chandra mandala, 2. Surya mandala, 3. Agni mandala
  7. This is the home of 'Tripura'

Popular