Search This Blog

515. Mooladhaarambhujaroodha

దీన్నే ఆధారచక్రము అంటారు. మూల అంటే - గుదస్థానం. శరీరం అంతటికీ ఆధారమైన చక్రము గుదస్థానంలో ఉంటుంది.కాబట్టి దీన్ని మూలాధార చక్రము అంటారు. ఈ పద్మానికి నాలుగు దళాలుంటాయి. వాటిలో వ నుంచి స వరకు అక్షరాలుంటాయి. దీనికి అధిదేవత గణపతి ఈ చక్రంలో ఉండే దేవత సిద్ధ విద్యాదేవి. దీనిలో పసుపురంగులో వర్తులాకారంలో భూమండలమున్నది. దానిమీద తెల్లని గుర్రం. ఆ గుర్రం మీద లం అనే బీజముంటుంది. ఇదే కుండలినీస్థానం. దీని మధ్యన విద్యుత్కాంతులతో త్రికోణముంటుంది. అందులో క్లీం బీజముంటుంది. ఆ బీజం మీద స్వయంభూలింగానికి మూడున్నర చుట్లు చుట్టుకుని సర్పాకారంలో కుండలినీశక్తి ఉంటుంది. ఇది గణపతిస్థానము.

This is called the base chakra. It located below the spinal cord. It has 4 petals. Letters from 'Va' to 'Sa' are present in these 4 petals. Ganapati is the adidevata for this chakra. Devata of this chakra is 'Siddha Vidhya'. The earth is present in here in yellow color. There is a white horse on it. 'Lam' beeja is on this horse. There is a triangle inside this. It is glowing like a thunder bolt. 'Kleem' beeja is in it. There is a swayambhuva linga on this. Kundalani is surrounding this linga like a serpent with three and a half rounds.

Popular