Search This Blog

424. Tatwasana

శివాది క్షితి పర్యంతము 25 తత్త్వాలను ఆసనముగా గలది. శ్రీచక్రంలో తత్త్వాలు 25 ఉన్నాయి. ఆ తత్వాలకు పైన బిందువునందు అమ్మ ఉంటుంది కాబట్టి, తత్త్వములే ఆసనముగా గలది.

25 తత్వాలు:

పంచభూతాలు - 1.గాలి 2.నీరు 3.నిప్పు, 4.భూమి 5.ఆకాశం - వీటితో సృష్టి చేయబడింది.

5 తన్మాత్రలు - 6. శబ్ద 7.స్పర్శ 8.రస 9.రూప 10.గంధము - పంచభూతాలకు జ్ఞానేంద్రియాలకు మధ్య సంబంధం. దీని గురించి పూర్తి వివరం పంచతన్మాత్ర సాయక అనే నామంలో ఉన్నది.

10 ఇంద్రియాలు - 11.కళ్ళు 12.ముక్కు 13.చెవులు 14.నాలుక 15.చర్మము (ఇవి జ్ఞానేంద్రియాలు) 16.చేతులు 17.కాళ్ళు 18.నోరు 19.మలద్వారం 20.మూత్రద్వారం (ఇవి కర్మేంద్రియాలు). ఇవి పంచభూతాలతో చేయబడ్డాయి.

21.మనస్సు - ఇది ఇంద్రియాలకు అధిపతి

22.బుద్ధి - ఇది మనస్సుకు అధిపతి

23.చిత్తం - ఇది బుద్ధిని ప్రభావితం చేయ గలదు.

24.అహంకారం - ఇది పైవాటినన్నిటినీ శాశించగలదు

25.మాయ - ఈ మాయ వలనే పైనవన్నీ పరబ్రహ్మానికి భిన్నంగా అనిపిస్తాయి.

అమ్మ వీటన్నిటిని ఆసనంగా చేసుకుని వాటి పైన కూర్చుంటుంది. అంటే ఆవిడే పరబ్రహ్మం.

There are 25 tatwas in the horizon. There are 25 tatwas in Srichakra. Since Divine mother is at the pinnacle above these tatwas, they are like her seat(throne).

25 tatwas:

5 elements - 1. Air 2. Water, 3. Fire, 4. Earth, 5. Space
5 Thamatras - 6. Sound, 7. Touch, 8. Taste, 9. Shape(form), 10. Scent. These are the relation between sense organs and the 5 elements. To know more about these thanmatras, please read the name pancha thanmatra saayaka
10 Organs - 11. Eyes, 12. Nose, 13. Ears, 14. Tongue, 15. Skin 16. Hands, 17. Legs, 18. Mouth, 19,20. Excretory organs - These are made of the 5 elements.
21. The mind - This is the master of all the organs
22. The intellect - This is the master of the mind
23. Chith - This influences the intellect
24. Ego - This can command all the above
25. Illusion - Due to this illusion, we perceive all the above as different from Parabrahma.

Divine mother makes all the above as her seat. Means she is above all. She is Parabrahma.

Popular