Search This Blog

371. Vaikharirupa

పరాస్థానంలో బయలుదేరిన వాక్కు నాలుక, దంతాలు మొదలైన స్థానాలకు తాకి స్పష్టమైన రూపం పొందుతుంది. ఆ రకంగా ముఖము ద్వారా బయటకు వచ్చి శబ్దతరంగాల రూపంలో చెవులకు చేరుతుంది. అనాహతం వరకు కేవలము హల్లులరూపంతో అస్పష్టంగా ఉన్న వాక్కు అక్కడ నుంచి విశుద్ధిచక్రం చేరుతుంది. విశుద్ధి చక్రానికి పదహారుదళాలున్నాయి. ఈ పదహారు దళాలలోను అ నుండి అః వరకు అచ్చులు ఉంటాయి.

మాతృకాహృదయంలో చెప్పినట్లుగా క నుంచి క్ష వరకు గల హల్లులు శివరూపాలు. అ నుంచి అః వరకు అచ్చులు శక్తి రూపాలు. అచ్చులు స్వతంత్రాలు హల్లులు స్వతంత్రాలు కావు. అందుచేత అనాహతం వరకు వాక్కు యొక్క స్పష్టత తెలియదు. ఈ వాక్కు విశుద్ధి చేరగానే అక్కడ ఉన్న అచ్చులతో కలిసి స్పష్టమైన రూపం పొంది ముఖం ద్వారా శబ్దరూపంలో బయటకు వచ్చి చెపులను చేరుతుంది.

అనాహతంలో వాక్కు కేవలము హల్లుల రూపంలోనే ఉంటుంది. విశుద్ధి చేరిన తరువాత క్ + అ = క, గ్ + ఇ = గి అని స్పష్టమైన రూపు సంతరించుకుంటుంది. ఈ రకంగా వాక్కు స్పష్టం కావటం నామశాఖ. స్థూలదృష్టికి గోచరమవటం అంటే చెవులకు వినిపించటం రూపశాఖ. ఈ కారణంచేతనే వాక్కు నామరూపాత్మకము అని చెప్పబడుతుంది. ఇలా వైఖరీ రూపంలో స్పష్టంగా వచ్చినటువంటి వాక్కు పతివ్రత, ప్రొధాంగన, మహాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి సదాశివుని వామాంకమందు ఆశీనురాలైన పరమేశ్వరి అని చెప్పబడుతోంది. ఈమెయే వాగీశ్వరీదేవి. మంత్రశాస్త్రంలో వాగీశ్వరీ మహామంత్రమున్నది.

The sound that originated in Bindu (as ParA) travels through mOlAdhAra (as pasyanti) and anAhata(as madhyama) and reaches vishuddhi( as vaikhari). Here passes through the teeth, tongue and lips and comes out as sound waves(speech). Till anAhata, the speech only has consonant sounds. But after reaching vishuddhi, it develops into complete speech by adding vowel sounds. Vishuddhi chakra has 16 petals. They represent the 16 vowel sounds.

As per mAtruka hrudayam, all consonant sounds are forms of Shiva. All vowels sounds are forms of Shakti. Vowels are self-sufficient. But consonants need vowels to make proper sound. That is why speech is not clear at anAhata. It becomes clear after merging with vowels in vishuddhi. This clear speech then reaches ears.

Vaikhari has both 'nama' (name) and 'roopa'(form). The sound becoming a clear speech in Vishuddhi is the 'nama'. It reaching the ears is 'roopa'. That is why speech is treated as the one that is having a 'nama' and 'roopa'. This is Goddess Vageeswari

Popular