తపోవంతులైన మునీశ్వరులచే, ఋషీశ్వరులచే ఆరాధింపబడునది. సంసార బంధనాలలో చిక్కుకున్న వారిచే ఆరాధింపదగినది.
తపము అంటే:
- మితంగా భోజనం చెయ్యటం. ఉపవాసము, చాంద్రాయణ వ్రతాదులచే శరీరాన్ని శుష్కింపచెయ్యటం - ఆకలి దప్పికలు, శీతోష్టాలు మొదలగు వాటిని సహించటం -
- మనోవాక్కాయకర్మలచే ఏకాగ్రత సాధించటం -
- ఇంద్రియాలను బుద్ధిలో లయం చేసి, ఆ బుద్ధిని పరమేశ్వరుని యందు లయం చేయ్యటం.
ఈ పనులు చేసేవారు సర్వభూతముల యొక్క హితవును కోరాలి. సాధువర్తన కలిగి ఉండాలి. అటువంటి ఉపాసక శ్రేష్ఠులను తాపసులు అంటారు. ఇటువంటి తాపసులచేత అమ్మ ఉపాసించబడుతుంది. అందుచేతనే ఆమె తాపసారాధ్యా అనబడుతోంది.
Tapa means:
- To eat for survival not for enjoyment. Chandrayana fasting. Being detached from body during hunger, thirst and extreme weather conditions.
- Aligning mind, speech and actions towards truth.
- Shunning sensory pleasures and concentrating on Atman.
Those who follow the above are called Tapasi. They are good samaritans. They wish good for all. Divine mother is sought by such taapasis. Hence she is called Tapasaradhya