అమ్మా నిను అర్థించుట ఆగర్భ వ్యసనమె
ఆజన్మాంతం నాకున్న అతి గొప్ప సాధనమె
ధ్యానమగ్నుడు తండ్రిగరు సాక్షత్తు శివ స్వరూపుడు
భవదీయుడనై వారిని చేరుకునె మార్గము చూపవె
బ్రహ్మండాన్ని ఘనించి పింఢముగ మరల్చి
నాకు ఊపిరి పోయడానికి ప్రసవ వేదన భరించి
పాలిచ్చి లాలించి అలక తీర్చి ఊరడించి అమ్మా
ఎన్నని చెప్పను నీ లీలా విశేషములు
ఎక్కడ వెతకి చూపను నీకన్నా గొప్ప అమ్మను
నీ చిరునవ్వులో నిజమైన సౌందర్యముంది
నువ్వు పెట్టిన ముద్దలో అసలైన అమ్రుతం ఉంది
నువు పిలిచే పిలుపులో ఎనలేని వాత్స్యల్యముంది
నీ కొన చూపులో అంతులెని ఐశ్వర్యముంది
సావిత్రి జగజ్జననీ మహా సాధ్వీ అరుపరూపి
ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి క్రియా శక్తి స్వరూపిని
మాత్రు స్దానంలొ ఊపిరి తీస్తున్న ఓ పరమాత్మ
నీ పాదపద్మములకు నివేదన నా అంతరాత్మ