Search This Blog

792 - 813. Kapardhini Vidya


కపర్ది అంటే శివుడు. కపర్దకము అంటే గవ్వ, శివుని జడముడి అని అర్ధం. కపర్దిని అంటే కపర్టి అనే పేరుగల శివుని యొక్క శక్తి. జటాజూటము ధరించినది. గవ్వలమాలలచే అలంకరించబడినది. శక్తి.

కపర్దినీశక్తి సాక్షాత్తూ పరమేశ్వరస్వరూపము. సత్యము, జ్ఞానము, ఆనందమే రూపంగా గలది. శాశ్వతమైనది. నిత్యమైనది. బ్రహ్మానందస్వరూప అయిన పరబ్రహ్మ, ఆమె పరమేశ్వరి. ఈమె ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. శివునితో కలిసే ఉంటుంది. శివుడు లేకుండా శక్తి లేదు. శక్తి లేకుండా శివుడు లేదు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. అదే శివశక్తుల సామరస్యము. కళల యొక్క రూపం ఈమె. కళలు విద్యాకళలని, వృత్తి కళలని, దేవకళలని ఉన్నాయి. వీటన్నింటి యొక్క స్వరూపం ఆ పరమేశ్వరియే. తనను నమ్మినవారి కోరికలు ఎటువంటివైనా సరే తీరుస్తుంది. ఆమె కామేశ్వరుని శక్తి. కామేశ్వరి. కామరూపిణి. సమస్తకళలకు నిధి. కవిత్వం కూడా ఒక కళే. కవులు వ్రాసినవి కావ్యాలు. ఆ కావ్యాలనే కళల రూపము ఆమే. శృంగారాది నవరసాలచే తెలియబడేది. రసానికి నిధి. రసము అంటే బ్రహ్మానందం. అటువంటి బ్రహ్మానందాన్ని ఎల్లప్పుడూ పొందేది. ఈ రకంగా అమితమైన ఆనందం పొందటం వల్ల పుష్టిగా ఉంటుంది. శివాది క్షితి పర్యంతము 36 తత్వాలతో నిండినదై పుష్టిగా ఉంటుంది. ఆది అనాది అయినది ఆమే. సృష్టి ప్రారంభానికి ముందే ఉన్నది. దేవతలను సృష్టించినది ఆమే. అంతేకాదు సృష్టికి కారకులయిన త్రిమూర్తులను సృష్టించింది కూడా ఆమే. అందుచేత అందరూ ఆమెను పూజిస్తారు. అందరూ అంటే - అన్ని లోకాలవారూ ఆమెను పూజిస్తారు. మానవులు, గంధర్వులు, దేవతలు ఇంతేకాదు. రాక్షసులు కూడా పరమేశ్వరిని అర్చిస్తారు. ఆమె ఈ జగత్తునంతటనూ పోషిస్తుంది. కలువల వంటి కనులు గలిగి ఉంటుంది. కోట్లకొలది సూర్యకాంతులతో ప్రకాశిస్తుంటుంది. అమితమైన తేజస్సుతో ఉంటుంది. అది దివ్యమైన జ్ఞానజ్యోతి. ఆమె అణువుకన్నా చిన్నది. మహత్తుకన్న గొప్పది. పరులకన్న పరమైనది. అంటే దేవతలకన్న కూడా శ్రేష్ఠమైనది. చేతిలో పాశం ధరించి ఉంటుంది. అంటే భక్తుల యొక్క పాశాలను, బంధనాలను తెంచివేసి వారికి మోక్షం ప్రసాదిస్తుంది. తన భక్తులను ఇబ్బందులపాలుచేసే అభిచారికమంత్రాలను విభేదిస్తుంది.


ఈ రకంగా కపర్దినీ విద్య 792 నుంచి 813వ నామం వరకు చెప్పబడుతోంది.

Kapardi means Shiva. Kapardakamu means hair, which refers to the hair of Shiva. Kapardini means the power of Shiva, who is in the form of Kapardi. She is adorned with matted hair and decorated with seashell garlands.

Kapardini Shakti is the embodiment of Lord Parameshwara. She can be expressed as embodiment of truth, knowledge, or bliss. She is eternal and permanent. The supreme Brahmananda is the embodiment of Parabrahma, who is none other than the Divine mother. She always exists in unity with Shiva. Without Shiva, there is no Shakti; without Shakti, there is no Shiva. Both are always together. This is the harmony of Shiva-Shakti. She is the form of arts such as music, dance, and painting. She is the form of all the three types of arts such as 1) Vidyakala, 2) Vruttikala, 3) Devakala. She fulfills all the desires of those seeking her. She is the Shakti of Kameshwara. She is Kamarupini (the one who takes any form). She is the treasure of all arts. All the poems written are her forms. She is known by the nine rasas (emotions). The essence of rasa is Brahmaananda (bliss). She is always in the state of Brahmananda. She has all the 36 tattvas within the horizon. She existed before creation began and created all gods and goddesses. Even the Trimurtis who are responsible for creation, sustenance and destruction were created by her. Therefore, everyone worships her - all people in all worlds worship her - humans, Gandharvas, and gods alike even demons worship the Divine mother. She nourishes this world like a mother and has eyes like lotus petals that shine like millions of suns together with infinite light.

She is smaller than an atom and greater than the greatest. That means she is superior to the gods. She holds the noose in her hand. That means she liberates her devotees from shackles of their sins and virtues. She protects all her seekers from any sort of harmful tantras.

This is the gist of Kapardhini Vidya explained from the names 792 to 813.

560. Taamboolapooritamukhee

తాంబూలేన పూరితం ముఖం యస్యాహ్  - సా 

తాంబూలముచే నిండిన ముఖము గలది. తాంబూల చర్వణమునందు ప్రీతిగలది. 

శంకరాభగవతపాదులు తమ సౌందర్య లహరిలోని 65వ శ్లోకంలో అమ్మవారి తాంబూలాన్ని ఇలా వర్ణించారు 

రణేజిత్వా దైత్యా నపహృత శిరస్త్రైహ్ కవచభిః
నివృత్తయ్ శ్చందాంశ త్రిపురహర నిర్మాల్యవిముఖైహ్
విశాఖేన్ద్రో పెన్డ్రై శ్శశివిశద కర్పూరాశకలాహ్ 
విలీయంతే మాత స్తవ వదన తాంబూల కబళాహ్ 

తల్లీ! యుద్ధంలో రాక్షసులను జయించి, శిరస్త్రాణాలను తీసివేసి, యుద్ధభూమి నుంచి తిరిగివస్తూ, చండీశ్వరునిచేత అనుభవింపతగిన శివనిర్మాల్యము వద్దు అన్నటువంటి విష్ణువు, ఇంద్రుడు, కుమారస్వామి మొదలైనవారు నీ నోటి వెంటవచ్చిన తాంబూల కబళములు తీసుకుంటున్నారు 

శివనిర్మాల్యం కన్నా అమ్మవారి తాంబూల కబళమే మిన్న అంటున్నారు శంకరులు.

Taamboolena pooritam mukham yasyah - sa

She whose mouth is filled with pan. She who likes chewing pan.

Shankarabhagavatapada described Divine mother's pan in verse 65 of his Soundarya Lahari:

raṇējitvā daityā napahr̥ta śirastraih kavacabhiḥ
nivr̥ttay ścandānśa tripurahara nirmālyavimukhaih
viśākhēndrō penḍrai śśaśiviśada karpūrāśakalāh
vilīyantē māta stava vadana tāmbūla kabaḷāh

O Mother! Vishnu, Indra and Kumaraswamy prefer the pan from your mouth than shivanirmalya. After defeating the enemies, they come home, discard their armour and helmet and come straight to you ignoring chandi who is offering shivanirmalya.

Saint Shankara says that Divine mother's pan is better than Shiva Nirmalyam.

557. Katyayani

కతుడనే మహర్షి కుమార్తె కాత్యాయని. కతులు అనబడే బ్రహ్మవేత్తల యందు నెలకొని ఉన్నది కావటంచేత కాత్యాయని ఆనబడుతుంది. నిరంతరము కన్యాత్వమునే కోరి పరాధీనత లేనటువంటి స్వాతంత్య్రము గలది కాత్యాయని.

రాక్షససంహారం కోసం దేవతల తేజస్సుతో ఆవిర్భవించిన దేవత. కాలికాపురాణంలో

కాత్యాయనీ చోడ్యాడే కామాఖ్యా కామరూపకే
పూర్ణేశీ పూర్ణగిరౌ చండీ జాలంధరే స్మృతా


కాత్యాయని ఓడ్యాన పీఠమందు ఉంటుంది. జాలంధర పీఠమందు (విశుద్ధి చక్రం) చండి. పూర్ణగిరి పీఠమందు (అనాహత చక్రం) పూర్ణేశ్వరి. కామగిరి పీఠమందు (మూలాధార చక్రం) కామాఖ్య.

దేవీ పురాణంలో

కం బ్రహ్మ కం శిరః ప్రోక్త మశ్శసారం చ కం మతం |
ధారణాద్వాసనా ద్వాపి తేన కాత్యాయనీ మతా ||


కం అనగా బ్రహ్మ, శిరస్సు, అస్మసారము అనబడును. దానిని ధరించుటచేత ఆమె కాత్యాయని అనబడుతున్నది. అంటే బ్రహ్మ శిరస్సు మొదలగు స్థానములందు వసించుటచేత ఆమె కాత్యాయని అనబడుతుంది.

దేవీ కవచంలో నవదుర్గలను చెబుతూ

ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీ తథా |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం ||
నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |


నవదుర్గలలో ఆరవదుర్గ కాత్యాయని

Katyayani was the daughter of sage Kathu. She resides in brahmins called Kathus. So, she is called Katyayani. Katyayani is the independent woman who constantly seeks virginity.
Katyayani is a deity born with the effulgence of the gods to slay the demons.

In Kalikapurana Katyayani Chodyade Kamakhya Kamarupake Poornesi Poornagirau Chandi Jalandhare Smrita Katyayani is in Odyana Peetha. Chandi on the Jalandhara Peetha (Vishuddhi Chakra). Purneshwari in Purnagiri Peetham (Anahata Chakra). Kamakhya at the base of Kamagiri Peetha (Muladhara Chakra). In Devi Purana Kam Brahma Kam Shirah Prokta Mashshasaram Cha Kam matam | Dharanadvasana dvapi thena katyayani mata || Kam means Brahma, the head, and is called Asmasara. She is said to be Katya by wearing it. That means she is said to be Katya because she resides in places such as Brahma's head. Navadurgas are explained in Devi Kavacha prathamaṁ śailaputrīti dvitīyaṁ brahmacāriṇī |
tr̥tīyaṁ candraghaṇṭēti kūṣmāṇḍēti caturthakaṁ ||
pan̄camaṁ skandamātēti ṣaṣṭhaṁ kātyāyanī tathā |
saptamaṁ kālarātrīti mahāgaurīti cāṣṭamaṁ ||
navamaṁ sid'dhidhātrī ca navadurgāḥ prakīrtitāḥ | Katyayani is the sixth Durga among the Navadurgas

Popular