Search This Blog

78. Mahaganesha nirbhinna vighnayantra praharshita

విశుక్రుడు పాతిన జయవిఘ్నయంత్రాన్ని మహాగణేశుడు నాశనం చేశాడన్న వార్త విని అమ్మ అమితానందం చెందింది. 

సంకల్పమాత్రంచేతనే ఆవిర్భవించిన మహాగణపతి తననుపోలిన ఆరుగురు గణపతులను సృష్టించాడు. వారు 

1. ఆమోద, 2.ప్రమోద, 3.సుముఖ, 4.దుర్ముఖ, 5.అవిఘ్న, 6.విఘ్నకర్త 

వీరందరితో కలిసి మహాగణపతి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ విశుక్రునిచే స్థాపించబడిన జయవిఘ్నయంత్రాన్ని నాశనం చేశాడు. 

ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం | 
కురు ఘంటా రావం తత్ర దేవతాహ్వాన లాంఛనం || 

మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే తమ బలం తగ్గిపోతుందని మనలోని రాక్షసగణాలు సాధనకు అడ్డుపడుతుంటాయి. అందుకే పూజ చేసే ముందు ఆ అసుర భావాలను తరిమి కొట్టడానికి ఘంటానాదం చేస్తారు. 

Divine Mother was overjoyed to hear that Mahaganesh had destroyed the Jayavignayantra created by  Vishukra. Mahaganapati, by his mere will, created six Ganapatis like himself. They are
1.Aamoda, 2.Pramoda, 3.Sumukha, 4.Durmukha, 5.Avighna, 6.Vignakarta
Together with them Mahaganapati went to war and destroyed the Jayavignayantra established by Vishukra.

aagamaathantu devaanaam gamanaartham tu raakshasaam |
kuru ghantaaraavam tatra devataahvaana laanchanam ||

The rakshasas within us hinder progress of our spiritual endeavours because they fear that their strength will diminish if we grow spiritually. That is why the bell is rung before performing a puja. The sound of a bell will drive away those demonic feelings.

58.Pancha Brahmasanasthitha

 


The scene described in this nama has a concept embedded into it. The picture depicts that Divine mother is sitting on a throne that has Brahma, Vishnu, Rudra and Eshana as its four legs. Sada shiva forms the flat bed of the throne. Divine mother sits on this throne in her house made of Chintamanis. Brahma, Vishnu, Rudra, Eshana and SadaShiva are called the five brahmas. Mother assigned 5 separate duties to them. By sitting on a throne supported by these five brahmas, it is clear that they follow her command and serve her always. That She is their master and they perform their duties as a mark of service to Her. Brahma is assigned the duty of creation. He creates life. Vishnu is assigned the duty of sustenance. He takes care of protection and nourishment. Rudra is assigned the duty of destruction. He takes away the life out of beings. Eshana is assigned the duty of annihilation. He will condense all the karma and tendencies of the being into a seed. He annihilates the seeds of those beings that liberated themselves from karmic bonds. Hence they don't have a rebirth. SadaShiva is assigned the duty of grace and favour. He grants another life those beings that could liberate themselves from karmic bonds. Beings inherit their past karma and tendencies from the seed.

ఈ నామములోని దృశ్యం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. అమ్మ సింహాసనానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు 4 కోళ్లుగా ఉన్నారు. సదాశివుడు దానిపై కూర్చునే పీఠగా ఉన్నాడు. వీరందరికి అమ్మ ఒక్కొక్క నిర్దిష్టమైన కర్తవ్యము అప్పగించింది. వారు అంకిత భావముతో, సేవాతత్పరతతో ఆ బాధ్యతలు చేపట్టారు. బ్రహ్మ కర్తవ్యం సృష్టి. అతడు జీవులను పుట్టిస్తాడు. విష్ణువు స్థితికారుడు. జీవుల రక్షణ, పోషణ అతని కర్తవ్యం. రుద్రుడు కర్తవ్యం నశింపజేయడం. అతడు జీవుల శరీరాలను నశింపజేస్తాడు. ఈశానుడుడి కర్తవ్యం సమ్మూలముగా నశింపజేయడం. అంటే జీవుల శేష కర్మలను మరియు వాసనలను సంచిత కర్మగా సంగ్రహించి భక్తి సాధనాల ద్వారా కర్మ పాశములను జయించిన జీవుల యొక్క సంచితకర్మను పూర్తిగా నశింపజేస్తాడు. అందుకే వారికి ఉత్తర జన్మ ఉండదు. కర్మ పాశములను జయించలేక ఇంకా భవ బంధములో చిక్కుకున్న జీవులకు సదాశివుడు ఉత్తర జన్మలు అనుగ్రహిస్తాడు. జీవులు వారి వారి సంచిత కర్మానుసారం మళ్ళీ జన్మ ఎత్తుతారు. 

57. Chinthamani grihanthastha

చింతామణి అనేది ఒక రకమైన మణి. అది ఎవరిదగ్గర ఉంటె వారికి కోరిన కోర్కెలన్నీ తక్షణమే తీరిపోతాయి. కనుక వారు ఎప్పుడు తృప్తిగా ఉంటారు. అమ్మ గృహం అసంఖ్యాకమైన చింతామణులతో నిర్మించబడిందిట. శివకామేశ్వరాంకస్థా నామంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ ఇంకా స్పష్టంగాను విపులంగాను వివరిస్తున్నారు. శివసాధనను కమనీయం చేసి కామవాసనను శివాత్మకం చేయడమంటే సాధకుల కష్టాలను, తాపాలను తీర్చేసి వారి దృష్టిని పరమాత్మ వైపు తిప్పి వారికి మోక్షము ప్రసాదించటమే కదా. అమ్మ చింతామణి గృహంలో కూర్చుంటుంది. ఆవిడకి తనకోసం అని ఏమి కోరికలు ఉండవు. అందుకని తన పిల్లల కోరికలు తీరుస్తూ ఉంటుంది. అదేకదా అమ్మతనం. 

Chintamani is a type of gemstone. It fulfills all the wishes of its owner. Hence those who possess a chintamani are always contended. Divine Mother's abode is made of infinite chintamani gem stones. The concept mentioned in the name Shivakameshwarankastha is being explained in greater detail here. Diverting desires towards Shiva and making penance a joyful experience means nothing but to fulfill all our desires. Remove all our hardships. So that we can easily focus on Paramatma during meditation. Mother lives in an abode made of Chintamani stones. She does not need anything for herself. So she will use them for the benefit of all her children. 

Popular